వందేభారత్ రైలు…నోరెళ్ళబెట్టి చూడాల్సిందే

వందే భారత్ రైలు అంటూ హోరెత్తిస్తోంది బీజేపీ. ఏపీకి సంక్రాంతి కానుక అంటున్నారు కాషాయం పార్టీ నేతలు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుకున్న ఈ రైలుని చూసేందుకు జనాలు బాగానే వచ్చారు. అందంగా కనిపిస్తున్న…

వందే భారత్ రైలు అంటూ హోరెత్తిస్తోంది బీజేపీ. ఏపీకి సంక్రాంతి కానుక అంటున్నారు కాషాయం పార్టీ నేతలు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుకున్న ఈ రైలుని చూసేందుకు జనాలు బాగానే వచ్చారు. అందంగా కనిపిస్తున్న వందేభారత్ రైలు జనాలను బాగానే ఆకట్టుకుంది.

చిత్రమేంటి అంటే వందెభారత్ రైలు రేట్లు. అవే మోత పెట్టిస్తున్నాయి. సికింద్రాబాద్ కి విశాఖకు 700 కిలోమీటర్ల దూరం ఉంది అర రోజు కు పైగా రైలు ప్రయాణం అని అంతా భారంగా అనుకునే పరిస్థితి నుంచి కేవలం ఎనిమిది గంటలలో భాగ్యనరం బాట పట్టవచ్చు అని చల్లని కబురు. వందేభారత్ మోసుకొచ్చింది అని సంబరపడ్డారు.

కానీ రేట్లు చూస్తే ఘాటెక్కిపోతోంది. హైదరాబాద్ కి వెళ్ళాలంటే ఎకానమీ రేట్ 1700 దాకా ఉంది. ఇక లగ్జరీ లో అయితే మూడు వేల రూపాయలు. పక్కన ఉన్న రాజమండ్రీకి నాలుగు వందల రూపాయలు అంటూంటే నోరేళ్లబెట్టి చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అని జనాలు నిట్టూరుస్తున్నారు.

మంచి టైం తో టైమింగ్ తో ట్రైన్ వచ్చింది అనుకుంటే ఇందులో సామాన్యుడుకి లేదు చాన్స్ అన్నట్లుగా రేట్లు వెక్కిరిస్తున్నాయి. ఈ ట్రైన్ కి తామే విశాఖ దాకా పొడిగించేలా చేశామని చెబుతున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. రైలు అన్నది సామాన్యుడి బండి. రేట్లు ఇలా హెవీగా పెడితే సగటు జీవులు ఎలా బండెక్కుతారు జీవీఎల్ అని అంటున్నారు. సదుపాయం తేవడం మంచిదే. కానీ అది అందరికీ అయిన నాడే కదా సార్ధకత. బీజేపీ వారు ఈ విషయం ఆలోచిస్తేనే వందేభారత్ కి ఫలమూ ఫలితమూ అంటున్నారు.