అతి పెద్ద ఫ్యామిలీని కలిపిన సంక్రాంతి

కుటుంబం అంతా ఒక్క చోట చేరి విందులు వినోదాలతో సందడి చేసేదే సంక్రాంతి. మూడు వందల అరవై అయిదు రోజులూ వ్యాపార వ్యవహారాల మీద ఎక్కడో దూరంగా ఉండేవారు అంతా ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి…

కుటుంబం అంతా ఒక్క చోట చేరి విందులు వినోదాలతో సందడి చేసేదే సంక్రాంతి. మూడు వందల అరవై అయిదు రోజులూ వ్యాపార వ్యవహారాల మీద ఎక్కడో దూరంగా ఉండేవారు అంతా ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి పల్లె బాట పట్టేది ఫ్యామిలీ గ్రూప్ ఫోటో కోసమే.

ఉమ్మడి విశాఖ జిల్లా మాడుగులలోని పెరుమాళ్ల వీధికి ఈసారి అసలైన సంక్రాంతి వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన 65 మంది కుటుంబ సభ్యులు అంతా ఎక్కడెక్కడి నుంచే వచ్చి ఒక్క చోట చేరారు. అంతా కులసాగా కబుర్లతో కాలక్షేపం చేశారు. ఈ గాలి ఈ నీరు అనుకుంటూ ఉత్సాహంగా చిందులు వేశారు.

ఆ ఇంటి పెద్దకు తొమ్మిది మంది కుమారులు కుమార్తెలు. వీరంతా దేశమంతా అనేక చోట్ల  స్థిరపడ్డారు. అయినా సంక్రాంతి పండుగ కోసం రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోయరు. వారి పిల్లలు పిలలల్తో ఆ లోగిలి సందడి చేస్తూంటే మిగిలిన ఊరు అంతా అలా చూస్తూండిపోయింది. ఇది కదా అసలైన సంక్రాంతి అని సంబరపడింది.

గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో చాలా మంది పల్లెటూర్లకు సంక్రాంతి వేళ రాకపోకలు తగ్గించేశారు. ఆ మూడు రోజుల కోసం ఎందుకంత శ్రమ అనుకున్న వారూ ఉన్నారు. కానీ మాడుగులలో ఈ అతి పెద్ద కుటుంబం ఇంత పెద్ద సంఖ్యలో ఒక పెళ్ళిని ఒక జాతరను తలపించేలా కలసికట్టుగా ఉండడం చూసి అయినా మిగిలిన వారు సంక్రాంతికి అర్ధం పరమార్ధం తెలుసుకోవాలని మాడుగులవాసులు అంటున్నారు.