బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషయంలో రకరకాల కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. అతడి మరణంపై సీబీఐ ధర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ధర్యాప్తులో భాగంగా అతడి ప్రియురాలు రియా చక్రబర్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంది. సుశాంత్ ఆత్మహత్యకు ఆమే కారణం అనే వాళ్లతో పాటు, ఆమె సుశాంత్ ను హత్య చేయించింది అనే ఆరోపణలు చేస్తున్న వారు కూడా గణనీయంగా ఉన్నారు.
ఈ క్రమంలో ఆమెను సీబీఐ అధికారులు అరెస్టు చేయబోతున్నారనే పుకార్లు కూడా ఊపందుకుంటున్నాయి. ఉత్తరాది మీడియా ఈ విషయంలో చాలా హడావుడి చేస్తోంది. అదిగో.. రియా అరెస్ట్, ఇదిగో రియా అరెస్ట్.. అని ప్రచారం చేస్తోంది అక్కడి మీడియా.
ఆ సంగతలా ఉంటే.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ – సారా అలీఖాన్ ల ప్రేమకథ గురించి మరిన్ని పుకార్లు గుప్పుమంటున్నాయి. ఒక సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరూ ఒకే రూమ్ లో ఉండేవారనే ప్రచారాన్ని కూడా కొంతమంది చేస్తున్నారు. ఆ తర్వాత బ్రేకప్ అయ్యిందని అంటున్నారు. ఈ క్రమంలో నటి కంగనా రనౌత్ స్పందిస్తూ సారా అలీఖాన్ ను నిందించింది. ఆమె స్టార్ హీరో కూతురు కాబట్టే అలా బ్రేకప్ చెప్పిందంటూ కంగనా నిందించింది.
ఆ సంగతలా ఉంటే.. సారా కోసం ఒక సారి సుశాంత్ చార్టెడ్ ఫ్లైట్ కూడా బుక్ చేశాడంటూ కొత్త వార్తలు వస్తున్నాయి. వారంతా పార్టీ చేసుకోవడానికి అంటూ బ్యాంకాక్ వెళ్లాడట. ఆ పార్టీ గురించి రియాకు సుశాంత్ చెబుతూ..అది బాయ్స్ ఓన్లీ పార్టీ అని చెప్పాడట. అయితే ఆ పార్టీకి సారా కూడా వెళ్లిందని, పబ్లిక్ ప్లైట్స్ లో వెళితే తను సుశాంత్ తో సన్నిహితంగా ఉంటున్న విషయం అందరికీ తెలుస్తుందని, సారా చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేయమందట. దీంతో సుశాంత్ ఆ పని చేశాడట!
ఇలా సుశాంత్ మరణం తర్వాత అతడి విషయంలో కొందరు రకరకాల మాటలు కూడా చెబుతున్నారు. ఏవి నిజాలో కానీ.. మీడియాకు మాత్రం ఇవన్నీ సంచలన కథనాలుగా మారాయి.