నేషనల్ అవార్డ్ విన్నర్ బన్నీ. అలాంటి హీరో డేట్లు దొరికితే ఎలా వుంటుంది? ఇదీ తెలుగు, తమిళ దర్శకుల ఆలోచన. అందుకే ఇద్దరు భారీ సినిమాల డైరక్టర్లు బన్నీ డేట్ ల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
సరైనోడు సినిమాతో బన్నీకి మాంచి హిట్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి ముందు వరుసలో వున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ గీతా సంస్థకు ఓ సినిమా డ్యూ వున్నారు బోయపాటి. అందువల్ల బన్నీ కనుక ఓకె అంటే ఉభయతారకంగా వుంటుంది.
జవాన్ సినిమాతో బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్నారు అట్లీ. ఆయనకు తెలుగులో సినిమా చేయాలని చాలా కాలంగా వుంది. అందుకే ఆయన బన్నీ డేట్ ల కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ గమ్మత్తేమిటంటే బన్నీ ఓ సినిమా చేయాల్సి వుంది. అది త్రివిక్రమ్ తో. దాని తరువాతే ఎవరి సినిమా అయినా. అలాగే ఈ ఇద్దరు దర్శకులు కూడా చెరో సినిమా విడుదల చేయాల్సి వుంది.
స్కంధ, జవాన్ సినిమాలు విడుదల కావాలి. వాటి ఫలితాలు తేలాలి. అప్పుడే చాన్స్ అనేది వుంటుంది. ఆ సినిమాల ఫలితాలు కనుక తేడా కొడితే ఇక బన్నీ డేట్ ల సంగతి మరిచిపోవచ్చు.
ఇదిలా వుంటే బన్నీ కూడా త్రివిక్రమ్ తరువాత సినిమాను కూడా లైన్ లో వుంచాలని చూస్తున్నారట. ఇప్పటికే పుష్ప వల్ల చాలా టైమ్ ఖర్చయిపోయింది. అందువల్ల ఇకపై చకచకా సినిమాలు చేసేందుకు వీలుగా మరో సినిమా కూడా లైన్ లోకి తీసుకురావాలని చూస్తున్నారట. మరి ఏ డైరక్టర్ కు ఆ చాన్స్ దొరుకుతుందో?