మీడియం జీవో సీక్రెట్ చెప్పిన జగన్!

వచ్చే ఏడాదినుంచి 1-6 తరగతులకు ఇంగ్లిష్ మీడియం చదువు మాత్రమే ఉంటుంది. ఎన్ని రకాల విమర్శలు వస్తున్నా ఈ విషయంలో జగన్మోహన రెడ్డి దృఢ నిశ్చయంతోనే ఉన్నారు. అదే సమయంలో.. తన నిర్ణయం పేదలకు…

వచ్చే ఏడాదినుంచి 1-6 తరగతులకు ఇంగ్లిష్ మీడియం చదువు మాత్రమే ఉంటుంది. ఎన్ని రకాల విమర్శలు వస్తున్నా ఈ విషయంలో జగన్మోహన రెడ్డి దృఢ నిశ్చయంతోనే ఉన్నారు. అదే సమయంలో.. తన నిర్ణయం పేదలకు మేలు చేసేది అని అంటున్నారు.

అయితే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక గల అసలు లక్ష్యాన్ని జగన్ మనబడి నాడునేడు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా బయటపెట్టారు.

రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం రోబోటిక్స్ రాజ్యమేలుతుందని.. ఇంగ్లిషు చదువులు లేకపోతే.. మన పిల్లలు వెనుకబడిపోయే ప్రమాదం ఉందని జగన్ చెప్పారు.

అంతకంటె కీలకమైన సీక్రెట్ ఏమిటంటే.. కార్పొరేట్ విద్యావ్యవస్థ నడ్డి విరవడం ఒక లక్ష్యంగా ఆయన ఇండైరక్టుగా పేర్కొన్నారు. కార్పొరేట్ చదువులకు కొమ్ముకాయడం సమంజసమా? అని జగన్ ప్రశ్నించారు.

కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ ఈ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉందో.. అందరికీ తెలుసు. పిల్లలకు మంచి చదువులు వస్తాయనే భ్రమలో కార్పొరేట్ స్కూళ్ల విషవలయాల్లోకి పిల్లల్ని నెట్టేసి నష్టపోతున్న వారు ఎందరో ఉన్నారు. పైగా జగన్మోహన రెడ్డి స్కూలు పిల్లల తల్లులకు ప్రతి ఏడాది డబ్బు ఇస్తున్నారు. ఆ పథకాన్ని ప్రెవేటు పాఠశాలలకు కూడా వర్తించేలా అమలు చేస్తున్నారు.

ప్రభుత్వ స్కూళ్లకు మాత్రం ఇస్తే, ఇంగ్లిషు మీడియం ఆశపడే పిల్లల తల్లిదండ్రులకు సాయం అందించరా? అనే విమర్శలు వస్తాయి. అందుకే అందరికీ ఇచ్చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిషు మీడియం తెస్తున్నారు.

ఇలా చేయడం వలన.. అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం వచ్చిన తర్వాత.. ఆర్థిక సహాయం పథకాన్ని ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే వర్తింపజేస్తే ప్రభుత్వం మీద భారం బాగా తగ్గుతుంది. కార్పొరేట్ కాలేజీలకు చెక్ పెట్టినట్టు అవుతుంది. 

సరైన వ్యూహాత్మక ప్రణాళికతోనే.. జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది.