తెలుగు సినిమాను రీమేక్ చేస్తున్న తమిళ కమేడియన్!

ఇప్పటికే పలు హాస్యప్రధాన సినిమాల్లో హీరోగా  నటించాడు సంతానం. ఒకవైపు కమేడియన్ గా స్టార్ స్టేటస్ లో కొనసాగుతూ మరోవైపు అడపాదడపా హీరోగా కూడా చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడో శంకర్ నిర్మించిన 'గది నంబర్…

ఇప్పటికే పలు హాస్యప్రధాన సినిమాల్లో హీరోగా  నటించాడు సంతానం. ఒకవైపు కమేడియన్ గా స్టార్ స్టేటస్ లో కొనసాగుతూ మరోవైపు అడపాదడపా హీరోగా కూడా చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడో శంకర్ నిర్మించిన 'గది నంబర్ 305లో దేవుడు' సినిమా నుంచినే ఇతడు హీరోగా సాగుతూ ఉన్నాడు.

ఈ క్రమంలో తెలుగు సినిమాల తమిళ రీమేక్ లలో కూడా సంతానానికి ముఖ్య పాత్రలు దక్కుతున్నాయి. ఇది వరకూ 'మర్యాద రామన్న' తమిళ రీమేక్ లో సంతానం హీరోగా నటించాడు.ఇప్పుడు మరో తెలుగు సినిమాను ఇతడు హీరోగా తమిళంలో రీమేక్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.

తెలుగులో మంచి హిట్ అనిపించుకున్న 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తమిళంలో రీమేక్ కాబోతోందని సమాచారం. తమిళ వెర్షన్లో హీరోగా సంతానం నటించబోతున్నట్టుగా తెలుస్తోంది.సరదాగా ప్రారంభమై, ఒక థ్రిల్లర్ టర్న్ తీసుకుని ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, ఇప్పుడు తమిళుల కోసం కూడా రూపొందుతూ ఉంది.