జబర్దస్త్ కు నాగబాబు గుడ్ బై?

అటు ఈ టీవీ కి, ఇటు మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ కు ఆయువు పట్టులాంటి జబర్దస్త్ కార్యక్రమం కాస్త పెద్ద కుదుపునకు గురవుతోంది. ఈ కార్యక్రమానికి బ్యాక్ బోన్ లాంటి  క్రియేటివ్ జంట…

అటు ఈ టీవీ కి, ఇటు మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ కు ఆయువు పట్టులాంటి జబర్దస్త్ కార్యక్రమం కాస్త పెద్ద కుదుపునకు గురవుతోంది. ఈ కార్యక్రమానికి బ్యాక్ బోన్ లాంటి  క్రియేటివ్ జంట నితిన్ అండ్ కో ఆ మధ్య ఇందులోంచి బయటకు వచ్చేసింది. కాస్త ఇగో క్లాష్ టైపులో బయటకు వెళ్లిన ఆ జంట క్రియేటర్లు జీ టీవీ కి వెళ్లి జబర్దస్త్ లాంటి షో కి రూపకల్పన చేసారు. చేయడమే కాకుండా జబర్దస్త్ లోంచి కొందరిని లాగే ప్రయత్నం చేసారు.

ఇందులో కీలకంగా చమ్మక్ చంద్ర వెళ్లిపోయారు.చమ్మక్ చంద్రకు చాలా హై రెమ్యూనిరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. స్కిట్ కు రెండు లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్లు బోగట్టా. దాంతో ఇప్పుడు జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర టీమ్ వుండదు. దాని బదులు అదే టీమ్ లోని సత్తి పండు-ఆనంద్ లతో కొత్త టీమ్ స్టార్ట్ అవుతుంది.

ఇదిలా వుంటే జనాలు వెళ్లిపోతారు అన్న అనుమానంతో మల్లెమాల సంస్థ అగ్రిమెంట్లు తీసుకునే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నాగబాబు ను కూడా అగ్రిమెంట్ చేయమని అడిగినట్లు తెలుస్తోంది. దానికి హర్ట్ అయిన నాగబాబు నిన్నటి నుంచి రావడం మానేసినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఇక నాగబాబు రారనే అనుకుంటున్నారు. తాను ఇక రాను అని నాగబాబు తన సన్నిహితులకు, స్కిట్ చేసే వారికి చెప్పినట్లు తెలుస్తోంది. 

మరి నాగబాబు ప్లేస్ లో ఎవరు వస్తారో? చూడాలి. మొత్తం మీద చిరకాలంగా ఈటీవీకి కాసుల పంట పండిస్తున్న జబర్దస్త్ కాస్త గట్టి కుదుపునకే గురవుతున్నట్లు కనిపిస్తోంది.