భగత్ సింగ్ అప్పుడే కాదు

పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో తయారు కావాల్సిన సినిమా భవదీయుడు భగత్ సింగ్. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా స్టార్ట్ కావడానికి…

పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో తయారు కావాల్సిన సినిమా భవదీయుడు భగత్ సింగ్. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా చాలా టైమ్ వుందని తెలుస్తోంది.

పవన్ ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా చేస్తున్నారు. అది ఫినిష్ కావాలి. విడుదల కావాలి. ఆ తరువాత హరి హర వీరమల్లు సినిమా బ్యాలన్స్ వర్క్ ఫినిష్ చేయాలి. ఆ తరువాతే భగత్ సింగ్ సినిమా. 

అందుకే కొన్నాళ్లు అమెరికా వెళ్లి రావాలని దర్శకుడు హరీష్ శంకర్ ఫిక్స్ అయిపోయారట. ఇక్కడ ఖాళీగా వుండి చేసే పనేం వుంది..కొన్నాళ్లు అమెరికా వెళ్లి వస్తానని ఆయన తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ లెక్కన చూస్తుంటే 2022 దసరా వేళకు భగత్ సింగ్ రెడీ అవుతుందా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లోగా రాజకీయ వ్యవహారాల్లో మార్పులు వస్తే మొదటికే మోసం వస్తుంది కూడా.