రీసెంట్ గా జరిగిన రాజా విక్రమార్క ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో తన కాబోయే భార్యకు సినిమా స్టయిల్ లో లవ్ ప్రపోజ్ చేశాడు కార్తికేయ. ఈనెల 21న కార్తికేయ-లోహిత పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా లోహితతో తన లవ్ జర్నీని బయటపెట్టాడు కార్తికేయ.
“మాది మరీ స్పెషల్ కపుల్ కాదు. ప్రతి కాలేజ్ లో కనిపించే లవ్ కపుల్ లాగే మేం కూడా ఉండేవాళ్లం. ఆ వయసులో మెచ్యూర్డ్ గా చేసిందేం లేదు. ఆ వయసులో గొప్పగా ఆలోచించలేం కదా. ఏళ్లు గడిచేకొద్దీ మెచ్యూరిటీ వచ్చింది. ఈ గ్యాప్ లో మాకు బ్రేకప్ కూడా అయింది. రెండేళ్లు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ప్యాచప్ అయింది.”
తామిద్దరం ప్రేమలో ఉన్నప్పటికీ అది ఎంత గాఢమైందనే విషయం తెలుసుకోవడానికి చాలా ఏళ్లు పట్టిందన్నాడు కార్తికేయ. రోజులు గడిచేకొద్దీ ఒకర్నొకరం బాగా అర్థం చేసుకున్నామని.. లోహిత కంటే బాగా తనను మరో అమ్మాయి అర్థం చేసుకోలేదనే విషయాన్ని గ్రహించానని చెప్పాడు కార్తికేయ. లోహితను ముద్దుగా ''లో'' అని పిలుస్తాననే విషయాన్ని కూడా బయటపెట్టాడు. పెళ్లి తర్వాత హీరోయిన్లతో లిప్ కిస్సులపై కూడా స్పందించాడు.
“పెళ్లి తర్వాత హీరోయిన్లతో లిప్ కిస్సులు, రొమాన్స్ లాంటివి చేయాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. మా లోహితతో ఇంకా మాట్లాడలేదు. అర్థం చేసుకుంటుందనే అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా గొడవ జరిగితే అప్పుడు ఆలోచిస్తాను. ప్రస్తుతానికైతే హీరోయిన్లతో రొమాన్స్ ఆపేసే ఆలోచనైతే లేదు.”
కార్తికేయ హీరోగా నటించిన రాజా విక్రమార్క సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు కార్తికేయ. ఈ సినిమాతో సక్సెస్ కొట్టి సంతోషంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాడు.