శెట్టి- పోలిశెట్టి- రొమాంటిక్ ఎంటర్ టైనర్

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. ఈ నెల 7న…

న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వంలో వంశీ, ప్ర‌మోద్‌ నిర్మించారు. ఈ నెల 7న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ మీడియాతో క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు.

హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ – ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న తీరు చూస్తుంటే మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. మేము సినిమాలో చెప్పబోతున్న పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనిపించింది. కృష్ణాష్టమి రోజు మా మూవీ రిలీజ్ అవుతుంది, కృష్ణుడు ఎలా అల్లరి చేస్తాడో, ఈ సినిమా కూడా అంతే అల్లరిగా ఉంటుంది. – జాతి రత్నాలు మూవీ చేసిన తర్వాత చాలా కథలు విన్నాను. జాతి రత్నాలు సినిమా సక్సెస్ కు మ్యాచ్ అయ్యే మంచి మూవీ సెలెక్ట్ చేసుకోవాలని వేచి చూశాను. మహేశ్ ఈ కథ చెప్పినప్పుడు ఆ ట్రాన్స్ లో కొద్ది సేపు ఉండిపోయా. అంత మంచి కథ ఇది.

ప్రమోషన్ అనేది ప్రతి సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లే బ్రిడ్జి లాంటిది. ఎవరు ప్రమోషన్ చేస్తున్నారనేది కాకుండా మా సినిమాను ఆడియెన్స్ దగ్గరకు ఎంత రీచ్ చేశామనేది ముఖ్యం. సినిమా షూటింగ్ టైమ్ లో నేను ఎవర్నీ కలవను. ఆ సినిమా ప్రపంచంలోనే ఉండిపోతాను. షూటింగ్ టైమ్ లో స్ట్రెస్ అవుతాం. కానీ ప్రమోషన్ టూర్ లో ఎంజాయ్ చేస్తుంటాను. ప్రేక్షకులకు నచ్చితే బాక్సాఫీస్ దగ్గర ఎంత దూరమైనా సినిమాను తీసుకెళ్తారు.

దర్శకుడు, బ్యానర్, హీరో అన్నింటికంటే కథ అనేది ముఖ్యం. ఆ కథలో ఎమోషన్, మంచి క్యారెక్టర్స్, ఎంటర్ టైన్ మెంట్ ఉండాలి. ఆ కథ మా సినిమాలో ఉంది. కాబట్టి మా డైరెక్టర్ సీనియరా, జూనియరా అనేది చూడలేదు. రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ లో ఒక కొత్త యాంగిల్ ఉంటుంది. అది నాకూ, అనుష్క గారికి ఇంప్రెసివ్ గా అనిపించింది.

దర్శకుడు పి.మహేశ్ బాబు మాట్లాడుతూ – మా సినిమాకు మీడియా మొదటినుంచీ సపోర్ట్ చేస్తున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సక్సెస్ మీద నమ్మకంతో ఉన్నాం. రీసెంట్ గా కొన్ని షోస్ వేసుకుని చూశాం. ఆ షోస్ కు రెస్పాన్స్ చాలా బాగుంది. శెట్టితో పోలిశెట్టి అనే హెడ్డింగ్ పేపర్ లో చదివా. ఆ రైమింగ్ తో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ఫిక్స్ చేశాం. మా ట్రైలర్ లో చూసింది 30 పర్సెంట్ అనుకుంటే సినిమాలో 70 పర్సెంట్ ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. మూవీ అంతా ఒక బ్యూటిఫుల్ జర్నీ అనిపిస్తుంది. అన్నారు.