ఆల్ ఫ్రీ అంటోంది టీడీపీ…అయినా కూడా…?

కొత్త ఏడాది 2024 నుంచి రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల మొత్తాలు పెరగనున్నాయి. మూడు వేల రూపాయలు ప్రతీ నెలా పించనుదారులకు అందిస్తామని వైసీపీకి చెందిన పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ప్రకటించారు. ముఖ్యమంత్రి…

కొత్త ఏడాది 2024 నుంచి రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల మొత్తాలు పెరగనున్నాయి. మూడు వేల రూపాయలు ప్రతీ నెలా పించనుదారులకు అందిస్తామని వైసీపీకి చెందిన పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట చెబితే తుచ తప్పకుండా అమలు చేస్తారని ఆయన అంటున్నారు. పెన్షన్ మొత్తాన్ని పెంచుకుంటూ పోతామని జగన్ ఎన్నికల ముందు చెప్పిన మాటకు కట్టుబడి మూడు వేల రూపాయలు అందించనున్నారని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఇస్తున్న 2,750 రూపాయల పెన్షన్ మొత్తం మూడు నెలల వ్యవధిలోనే పెరుగుతుంది అని అన్నారు. తాము చెప్పింది చేస్తామని, టీడీపీలా కల్లబొల్లి మాటలు మాట్లాడబోమని ఆయన అన్నారు. సంక్షేమం అంటే వైసీపీదే అని ఆయన గొప్పగా చాటారు. టీడీపీ మాదిరిగా తాము మభ్యపెట్టమని అన్నారు. తమను చూసి టీడీపీ కూడా సంక్షేమ పధకాలను అమలు చేస్తామని చెబుతోందని అంటోందని ఎమ్మెల్యే బాబూరావు ఎద్దేవా చేశారు.

టీడీపీ చెప్పే బూటకపు మాటలను అసలు నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. పెన్షన్ సొమ్ము అవ్వా తాతలకు ఆసరాగా నిలుస్తుంది అని ఆయన అన్నారు. వారికి అండగా నిలిచేది ఒక్క జగన్ మాత్రమే అన్నారు.

టీడీపీ వారు ఆల్ ఫ్రీ అంటున్నారు. అన్నీ ఇచ్చేస్తామని అంటున్నారు. అయినా ప్రజలు మాత్రం వారిని నమ్మీ ప్రసక్తి లేదని అన్నారు. ఒకటో తారీఖున ఠంచనుగా వచ్చి పెన్షన్ ఇస్తున్నారని, వాలంటీర్లకు ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నాని అని బాబూరావు చెప్పారు. రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పెన్షన్ మాట తప్పని నైజంతో ఏ ఒక్క పధకాన్ని ఆపలేదని ఆయన గుర్తు చేశారు. దటీజ్ జగన్ అన్నారు.