కులాల వారీ ఛలో.. అమెరికా!

అమెరికాలో మన జనాలు కులాల వారీగా ఏనాడో విడిపోయారన్నది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా చెప్పుకునే నిజం. ఆటా.. నాటా.. తానా.. ఇంకా.. ఇంకా.. చాలా అంటే చాలా సంఘాలు వున్నాయి. ఎవరి కుంపటి వారిది. …

అమెరికాలో మన జనాలు కులాల వారీగా ఏనాడో విడిపోయారన్నది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా చెప్పుకునే నిజం. ఆటా.. నాటా.. తానా.. ఇంకా.. ఇంకా.. చాలా అంటే చాలా సంఘాలు వున్నాయి. ఎవరి కుంపటి వారిది. 

తమ సమావేశాలు పెడితే ఇక ఇండియా నుంచి సెలబ్రిటీలను రప్పించడం హడావుడి చేయడం కూడా మామూలే. కొన్నింటికి వాళ్ల కులపోళ్ల తో పాటు మిగిలిన ఒకరిద్దరని మొహమాటానికైనా తీసుకెళ్లి, సమకులస్థాపన అన్న కలర్ ఇవ్వడం జరుగుతూ వుంటుంది.

ఆటా.. తానా లాంటి సీనియర్లను చూసి మిగిలిన కుల సంఘాలు కూడా అదే బాట పడుతున్నాయి. వాళ్లు కూడా వెదికి వెదికి తమ కులంలో వున్న సెలబ్రిటీలను, ముఖ్యులను వెదికి వెదికి మరీ టికెట్ లు వేసి అమెరికా పిలిపిస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ జనాల మీద ఈ తరహా వత్తిడి ఎక్కువ వుంటుంది. వారు కూడా ఫ్రీగా టికెట్ వేస్తున్నారు కదా.. అమెరికా పోయి చూసి రావచ్చు అని హ్యాపీగా వెళ్తున్నారు.

ఇప్పుడు అమెరికాలో తెలుగు సినిమా జనాలు చాలా మందే వున్నారు. కేవలం సినిమా సెలబ్రిటీలు మాత్రమే కాదు, సినిమాలతో, హీరోలతో అనుబంధం వున్నవారు కూడా అమెరికా లో వాలిపోయారు. 

రెండు కీలక కులాల సమావేశాలు అమెరికాలో ఒకేసారి జరగడంతో, పలువురు నటులు, దర్శకులు, జర్నలిస్ట్ లు, ఆఖరికి ఫ్యాన్స్ అసోసియేషన్ జనాలు కూడా ఈ రెండు సమావేశాలకు వెళ్లిపోయారు. రెండు కులాలకు చెందిన నటులు, దర్శకులు కీలకంగా వున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి అమెరికా వెళ్లాలంటే షార్ట్ కట్ రూట్ కుల సంఘాల సమావేశాలే అనుకోవాలేమో?