పెళ్లికి ముందే నాపై అత్యాచారం…బుల్లితెర న‌టి

పెళ్లికి ముందే త‌న‌పై ఆరుసార్లు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని బుల్లితెర న‌టి ఆరోపించింది. ఈ మేర‌కు భ‌ర్త‌పై ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లో చోటు చేసుకుంది. వాళ్లిద్ద‌రూ బుల్లితెర‌, వెండితెర…

పెళ్లికి ముందే త‌న‌పై ఆరుసార్లు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌ని బుల్లితెర న‌టి ఆరోపించింది. ఈ మేర‌కు భ‌ర్త‌పై ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లో చోటు చేసుకుంది. వాళ్లిద్ద‌రూ బుల్లితెర‌, వెండితెర న‌టులు. ఆయా రంగాల్లో రాణించాల‌ని కృషి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వాళ్లిద్ద‌రికీ సోష‌ల్ మీడియాలో ప‌రిచ‌యం అయ్యింది. బుల్లితెర న‌టికి అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని అత‌ను న‌మ్మ‌బ‌లికాడు.

ఈ క్ర‌మంలో క‌ల‌వాల‌ని ఇద్ద‌రూ నిర్ణ‌యించుకున్నారు. అత‌న్ని త‌న ఇంటికి ఆహ్వానించింది. ప‌ర‌స్ప‌రంగా ఇష్టంగా ఉండ‌డంతో ఇద్ద‌రూ శారీర‌కంగా ద‌గ్గ‌ర‌య్యారు. ఇలా అనేక‌మార్లు కామ‌వాంఛ‌లు తీర్చుకున్నాడ‌ని ఆమె పేర్కొంది. పెళ్లి ప్ర‌స్తావ‌న తేవ‌డంతో త‌ప్పించుకోవాల‌ని ప్ర‌య‌త్నించాడు.

వాంఛ‌లు తీర్చుకోవ‌డంతో ఆమెకు దూర‌మ‌వుతూ వ‌చ్చాడు. కానీ ఆమె విడిచిపెట్ట‌లేదు. అనేక రకాలుగా ఒత్తిళ్లు తేవ‌డంతో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. అత్తింటి వారింటికి బుల్లితెర న‌టి వెళ్లింది. బ‌ల‌వంతంగా తాళి క‌ట్టాల్సి వ‌చ్చింద‌ని త‌ల్లిదండ్రుల‌కు అత‌ను చెప్పాడు. దీంతో అత్తింటింలో గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి.

ఆమెను ఎలాగైనా విడిపించుకోవాల‌నే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. క‌ట్నం తేవాల‌ని వేధించ‌సాగారు. అలాగే కులం పేరుతో దూష‌ణ‌లు స‌రేస‌రి. దీంతో తాను శారీర‌కంగా, మాన‌సికంగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఆస్ప‌త్రి పాలైన‌ట్టు స‌ద‌రు బుల్లితెర న‌టి వాపోయింది. ఈ క్ర‌మంలో పెళ్లికి ముందే త‌న‌పై భ‌ర్త అత్యాచారానికి పాల్ప‌డ్డాడ‌ని బ‌స‌వ‌న‌గుడి మ‌హిళా పోలీస్‌స్టేష‌న్‌లో బుల్లితెర న‌టి ఫిర్యాదు చేసింది. పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.