నాగశౌర్యతో ఛలో సినిమాతో హిట్ కొట్టి, నితిన్ తో భీష్మ సినిమా ఫినిష్ చేసే పనిలో వున్నారు డైరక్టర్ వెంకీ కుడుముల.
ఇటీవల విడుదలయిన భీష్మ టీజర్ కు భలే బజ్ వచ్చింది. ఎంత బజ్ అంటే డైరక్ట్ గా ఫస్ట్ కాపీ సేల్ చేస్తారా అని నిర్మాతలకు ఎంక్వయిరీలు వచ్చేంత.
దీంతో భీష్మ సినిమా డైరక్టర్ మూడో సినిమా దాదాపు ఫిక్స్ అయిపోయింది. బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ లో వెంకీ కుడుముల మూడో సినిమా వుండబోతోందని బోగట్టా. అయితే ఎవరితో సినిమా అన్నది ఇంకా తెలియదు.
మైత్రీ మూవీస్ కు యంగ్ హీరోలు అందరితీ మాంచి రాపో వుంది. నాని, చైతన్య, విజయ్, సాయి తేజ్ ఇలా అందరితో చేసారు, మళ్లీ చేసే ఆలోచనలో వున్నారు.
అందువల్ల వెంకీ కుడుముల మాంచి కథ సెట్ చేసుకోగలిగితే వీళ్లలో ఎవరితో ఒకరితో సినిమా సెట్ చేయడం అన్నది మైత్రీ మూవీస్ కు కష్టం కాదు.