థమన్.. ఇక ఎప్పటికీ ఇంతేనా?

చాలా ఏళ్ల క్రితం ఎస్ఎస్ థమన్ అంటే..సేమ్ టు సేమ్ థమన్ అనే ట్రోలింగ్ వుండేది. అలా అలా వెనక్కు వెళ్లిపోయి, అలవైకుంఠపురములో సినిమాతో ముందుకు దూసుకువచ్చాడు. ఆ తరువాత మళ్లీ సరైన ఆల్బమ్ రావడం…

చాలా ఏళ్ల క్రితం ఎస్ఎస్ థమన్ అంటే..సేమ్ టు సేమ్ థమన్ అనే ట్రోలింగ్ వుండేది. అలా అలా వెనక్కు వెళ్లిపోయి, అలవైకుంఠపురములో సినిమాతో ముందుకు దూసుకువచ్చాడు. ఆ తరువాత మళ్లీ సరైన ఆల్బమ్ రావడం లేదు. విపరీతమైన ట్రోలింగ్ కు గురవుతున్నాడు. 

మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ ఎర్త్ అండ్ హెవెన్ మూవ్ చేయాల్సి వచ్చింది అనే టాక్ వుంది. ఇలాంటి నేపథ్యంలో ఓజి టీజర్ వచ్చింది. మ్యూజిక్ అదగొట్టాడని కొందరు. కాదు, విక్రమ్ సినిమా ప్రభావం గట్టిగా పడిందని కొందరు అంటూ వచ్చారు.

ఈ లోగానే నెటిజన్లు అసలు ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చారో ఆ ఒరిజినల్ బయటకు తీసేసారు. ఎలక్ట్రానిక్ ప్లే లిస్ట్ లో వున్న స్ప్లాషర్ అనే బిట్ నుంచి ఈ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ను కొట్టేసి నట్లు నెటిజన్ లు ట్వీట్ లు వేయడం మొదలుపెట్టేసారు. ఓ పక్క అనిరుధ్ బిట్ అనుకుంటుంటే ఇది బయటకు రావడంతో థమన్ టాలెంట్ తెలిసిపోయింది.

కానీ ఇది అలా ఆ నోట ఈ నోటా పడి హీరో మహేష్ బాబు దాకా వెళ్తే ఎలా వుంటుందో? ఎందుకంటే కేవలం త్రివిక్రమ్ ప్రెషర్ మీద థమన్ ను కొనసాగిస్తున్నారని బలంగా గ్యాసిప్ లు వున్నాయి. ఇప్పటికీ ఇంకా కాపీ మ్యూజిక్ నే ఇస్తున్నాడని తెలిస్తే.. కథ మళ్లీ మొదటికి వస్తుందేమో?