ఖుషీ…మలివారం ఎఫెక్ట్ ఏమేరకు?

ఖుషీ ఫస్ట్ వీకెండ్ ముగిసింది. కొన్ని ఏరియాలు బాగున్నాయి. కొన్ని ఏరియాలు డల్ గా వున్నాయి. చాలా కాలం తరవాత విజయ్ దేవరకొండకు సరైన హిట్ వచ్చింది.. సమంతకు హిట్ పడింది అనే టాక్…

ఖుషీ ఫస్ట్ వీకెండ్ ముగిసింది. కొన్ని ఏరియాలు బాగున్నాయి. కొన్ని ఏరియాలు డల్ గా వున్నాయి. చాలా కాలం తరవాత విజయ్ దేవరకొండకు సరైన హిట్ వచ్చింది.. సమంతకు హిట్ పడింది అనే టాక్ వచ్చినా, వివిధ కారణాల వల్ల ఆ ఆనందం పూర్తి స్థాయికి చేరడం లేదు. విడుదలయిన మలి రోజే క్రికెట్ మ్యాచ్ దెబ్బతీసింది. ఆదివారం బాగుంది అనుకుంటే మండే వచ్చేసింది. పైగా అటు ఉత్తరాంధ్రకు, ఇటు నైజాం కూడా తుపాను వచ్చి పడింది.

సినిమాకు మీడియాలో మంచి టాక్ వచ్చినా గ్రౌండ్ లెవెల్ లో డివైడ్ టాక్ వచ్చింది. పైగా లవ్ జానర్ సినిమాలు ఇటీవల సక్సెస్ రీచ్ కావడం కష్టంగా వుంది. ముఖ్యంగా సీడెడ్ జనాలకు ఇలాంటి సినిమాలు అంతగా ఎక్కవు. అందువల్ల అక్కడ బయ్యర్ కు ఈ ఖుషీ బ్రేక్ ఈవెన్ కావడం కాస్త కష్టం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. సీడెట్ లో ఖర్చులతో కలిపి ఆరు కోట్లు రాబట్టాలి. ఇది కాస్త కష్టమైన టాస్క్ నే.

నైజాం 15 కోట్ల రేషియో కనుక బాగానే వుంది 11 కోట్ల వరకు వసూలు చేసింది కనుక, మెల్లగా టార్గెట్ చేరే అవకాశం వుంది. వైజాగ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు, నెల్లూరు ఎలా వుంటాయో చూడాలి. కృష్ణ, గుంటూరు ఫస్ట్ వీకెండ్ కాస్త నీరసమైన ఫలితాలే నమోదు చేసాయి.

ఇదిలా వుంటే నాలుగురోజులు తిరగకుండానే శెట్టి-పోలిశెట్టి, జవాన్ సినిమాలు వస్తున్నాయి. జవాన్ సినిమా ప్రభావం నైజాంలో ఎక్కువ వుంటుంది. శెట్టి – పోలిశెట్టి ప్రభావం దాని రిజల్ట్ ను బట్టి వుంటుంది. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, పోటీ సినిమాలు తట్టుకుని ఖుషీ నిలబడాల్సి వుంటుంది.

అయితే ఖుషీ సినిమా నిర్మాతలు మైత్రీ మూవీస్ కు మాత్రం మాంచి లాభాలు పండించాయి. ఆగిపోయిన సినిమా ‘హీరో’ మీద పెట్టిన ఖర్చు, ఆ మధ్య విడుదల చేసిన ఒకటి రెండు చిన్న సినిమాల ఖర్చులు కూడా ఖుషీ లో వెనక్కు వచ్చేసాయని తెలుస్తోంది.