మరో కేబినెట్ భేటీ.. మరికొన్ని సంచలనాలు

కేబినెట్ భేటీ అంటే చాలు.. ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుడుతోంది. అవును.. మంత్రివర్గ సమావేశం పెట్టిన ప్రతిసారి కీలక నిర్ణయాలు తీసుకుంటూ, జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు…

కేబినెట్ భేటీ అంటే చాలు.. ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుడుతోంది. అవును.. మంత్రివర్గ సమావేశం పెట్టిన ప్రతిసారి కీలక నిర్ణయాలు తీసుకుంటూ, జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు చూసి, కేబినెట్ భేటీలు ఇలా కూడా నిర్వహించవచ్చా అని అంతా ఆశ్చర్యపోయేలా జగన్ వ్యవహరిస్తున్నారు.

ఒకప్పుడు కేబినెట్ సమావేశం అంటే పొద్దున్నంచి రాత్రి వరకు అదే పని. అదేదో ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశం అయినట్టు, రాత్రికి ఓ మంత్రి వచ్చి పేపర్ చదివి వెళ్లిపోతాడు. అన్నీ వాళ్లకు అనుకూలంగా ఉన్నవి, ప్రజలకు అక్కర్లేని నిర్ణయాలు ఉండేవి. అవినీతికి ఆనవాలుగా మారిన నీరు-చెట్టు కార్యక్రమం ప్రతి సమావేశంలో కామన్. ఇలా సాగేది అప్పట్లో కేబినెట్ వ్యవహారం.

కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేబినెట్ నిర్ణయాలన్నీ రెండంటే రెండు అంశాల ఎజెండాగా సాగుతున్నాయి. ఒకటి ప్రజాసంక్షేమం, రెండు బడ్జెట్ నియంత్రణ. ఈ దిశగా ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్, మరికాసేపట్లో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఇంకొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

ఇవాళ్టి కేబినెట్ భేటీలో ఇసుక అక్రమ రవాణాపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇసుకను అక్రమంగా తరలించే వ్యక్తులకు గరిష్టంగా రెండేళ్ల వరకు జైలుశిక్ష విధించేలా నిర్ణయం తీసుకుంటారు. ఇది చట్టంగా రాకముందే, ఆర్డినెన్స్ రూపంలో తక్షణం అమలుకాబోతోంది. రేపట్నుంచి వారం రోజుల పాటు ఇసుక వారోత్సవాలు జరగనున్నాయి. వినియోగదారులందరికీ అడిగినంత ఇసుక ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సంబంధిత డిపార్ట్ మెంట్లలో ఉద్యోగులకు శెలవులు కూడా రద్దుచేశారు. ఇదే టైమ్ లో ఈ ఆర్డినెన్స్ ను కూడా తీసుకొచ్చి ఇసుక కొరతను అరికట్టాలని నిర్ణయించారు.

ఇప్పటికే గ్రామ సచివాలయాల్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి, ఇప్పుడు గ్రామ న్యాయాలయాలపై దృష్టిపెట్టారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ లో అమలుచేసే అంశంపై కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇలా చేయడం వల్ల చిన్నచిన్న సివిల్ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయి. ప్రజలకు న్యాయం సత్వరం అందుకుంది.

ఈ నిర్ణయాలతో పాటు ఎసైన్డ్ భూములపై కూడా ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడో 12 ఏళ్ల కిందట అక్రమ ప్లాట్లు, ఇల్లీగల్ లే-అవుట్స్ ను రెగ్యులరైజ్ చేశారు. ఇప్పుడు మళ్లీ మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. 2019, ఆగస్ట్ 31 వరకు సేల్ డీల్ ఉన్న డాక్యుమెంట్లను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించారు. అటు అసైన్డ్ భూములున్న దళితులకు మార్కెట్ రేటు కంటే 10శాతం ఎక్కువ పరిహారం అందేలా కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు.