గ్యాస్ పంపిణీలో మేఘా నవశకం!

నాణ్యత, పర్యావరణహితం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ… గ్యాస్ పంపిణీ వ్యవస్థలోనే నవశకానికి నాంది పలికింది మేఘా గ్యాస్. ఇన్నాళ్లు ఇంజనీరింగ్ రంగంలో అగ్రగ్రామిగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇప్పుడు గ్యాస్…

నాణ్యత, పర్యావరణహితం, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ… గ్యాస్ పంపిణీ వ్యవస్థలోనే నవశకానికి నాంది పలికింది మేఘా గ్యాస్. ఇన్నాళ్లు ఇంజనీరింగ్ రంగంలో అగ్రగ్రామిగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇప్పుడు గ్యాస్ పంపిణీలో తనదైన ముద్రను వేస్తూ ఇంటింటికీ చేరువవుతోంది. ఇంటి అవసరాలకే కాదు, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు నేచురల్ గ్యాస్ను పైపుల ద్వారా పంపిణీ చేసేందుకు పక్కా ప్రణాళికలు తయారు చేసింది కంపెనీలోని హైడ్రోకార్బన్స్ డివిజన్. ఇప్పటికే ఆటో మొబైల్ రంగంలో గ్యాస్ సరఫరా కోసం 9 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభంచింది. ఇప్పుడు మరో ఐదింటిని వచ్చే మూడు నెలల్లో ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం  16 జిల్లాల్లో గ్యాస్ పంపిణీ కోసం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతులను పొందింది.  మేఘా గ్యాస్ బ్రాండ్ పేరుతో మేఘా ఇంజినీరింగ్ గ్యాస్ పంపిణీ వ్యవస్థను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా, కర్ణాటకలోని తుమకూరు, బెలగావి జిల్లాల్లో గ్యాస్ పంపిణీని  ప్రారంభించింది. కాగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో సహా తెలంగాణా జిల్లాల్లో త్వరలో గ్యాస్ పంపిణీని ప్రారంభించనుంది. 

వేల కిలోమీటర్ల పైప్ లైన్
ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ కోసం అత్యంత నాణ్యతతో కూడిన భద్రతమైన పైప్లైన్లు వేస్తోంది మేఘా గ్యాస్. ఇప్పటికే 1200 కిలోమీటర్ల పైప్లైన్ను వేసింది.త్వరలో మరో 5 వేల కిలోమీటర్ల పైప్లైన్ను మూడు రాష్ట్రాల్లో వేయనుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)ను, ఆటో మొబైల్ రంగానికి  కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)ని సరఫరా చేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గ్యాస్ గ్రిడ్ను అభివృద్ధి పరిచేందుకు ఓఎన్జీసీ నుంచి నాగాయలంక, వెస్ట్ పెనుగొండ ఆన్షోర్ గ్యాస్ క్షేత్రాలను దక్కించుకుంది. వీటి నుంచి రోజుకి లక్షా 30 వేల ఎస్సీఎం గ్యాస్ను తరలించనుంది. ఇందుకోసం అమెరికా నుంచి రప్పించిన మెకానికల్ రిఫ్రిజేషన్ యూనిట్లు, కంప్రెసర్లు ఇతర మెకానికల్ ప్యాకేజీలను  వినియోగిస్తోంది. ఇప్పటికే నాగాయలంక క్రేత్రం నుంచి నేచురల్గ్యాస్ను కృష్టాజిల్లాలోని వినియోగదారులకు పంపిణీ చేస్తోంది.  గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) ద్వారా వివిధ వనరుల నుంచి రోజుకి 40 వేల ఎస్సీఎం (స్టాండర్డ్ క్కుబిక్ మీటర్ ) నేచురల్ గ్యాస్ను సమీకరిస్తోంది. 

తెలుగు రాష్ట్రాలకు పక్కా ప్లాన్..
ఏపీలోని కృష్ణా జిల్లాలో విస్తృతంగా పైపుల ద్వారా  నేచురల్ గ్యాస్ పంపిణీ చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. దీనికి తోడు ఆటోమొబైల్ రంగానికి ఇప్పటికే 9 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించిన మేఘా గ్యాస్ మూడు నెలల్లో మరో ఐదు సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది.  ప్రస్తుతం ఉన్న 9 సీఎన్జీ స్టేషన్ల ద్వారా ప్రతి నెలా నాలున్నర లక్షల ఎస్సీఎం గ్యాస్ను విక్రయిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐదు సీఎన్జీ స్టేషన్ల ద్వారా మరో మూడు లక్షల ఎస్సీఎం గ్యాస్ ను సరఫరా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కృష్ణాజిల్లాలో  13 వేల మంది గృహ వినియోగదారులకు పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ను పంపిణీ చేస్తోంది. ఈ నెలాఖరు మరో రెండు వేల మంది వినియోగదారులకు పీఎన్జీ ని పంపిణీ చేయనుంది. ప్రస్తుతం వాణిజ్య వినియోగదారులకు ప్రతినెలా 60 వేల ఎస్సీఎం గ్యాస్ను అందిస్తోంది. త్వరలో ప్రతినెలా లక్ష ఎస్సీఎం ల గ్యాస్ను సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
 
తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి త్వరలో గ్యాస్ పంపిణీకి సన్నహాలను చేస్తున్నది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్ జిల్లాల్లో 12 కిలోమీటర్ల మేర పైపులైను వేయగా వచ్చే మూడు నెలల్లో మిగతా జిల్లాల్లో పైప్లైను పనులను విస్తరించి సేవలను ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నది. 

మేఘా గ్యాస్ కోసం పెరిగిన డిమాండ్ 
కర్ణాటకలోని బెలగావి, తుమకూరు జిల్లాల్లో మేఘా గ్యాస్ కోసం డిమాండ్ పెరుగుతోంది. ఇంటింటికీ గ్యాస్తోపాటు వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు మేఘా గ్యాస్ ను వాడటానికి ముందుకొస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో అంచనాకు మించిన డిమాండ్ ఉంది. ఒక్క తుమకూరు జిల్లాలోనే మొత్తం 12,500 మంది వినియోగదారులకు ప్రస్తుతం పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తోంది. ఈ నెలాఖారుకు మరో నాలుగు వేల గ్యాస్ కనెక్షన్లను ఇవ్వనుంది. వాణిజ్య వినియోగదారులకు ప్రతి నెలా లక్షా 40 వేల ఎస్సీఎం గ్యాస్ను పంపిణీ చేస్తుండగా, త్వరలోనే ఈ డిమాండ్ రెట్టంపు కానుంది. బెలగావి జిల్లాలో ఇప్పటికే 15వేల మంది వినియోగదారులకు పీఎన్జీని సరఫరా చేస్తుండగా త్వరలో మరో 2500 వేల మందికి సరఫరా చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ జిల్లాలో వాణిజ్య వినియోగదారులకు సరఫరా చేస్తున్న గ్యాస్ నెలకు 2,10,000 ఎస్సీఎంకు చేరుకుంది. సమీప భవిష్యత్లో మరో మూడు లక్షల ఎస్సీఎం గ్యాస్ సరఫరా అవకాశం ఉంది. ఈ రెండు జిల్లాల్లో నాలుగు సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పరిశ్రమల్లో నేచురల్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గాను ప్రత్యేక ప్రణాళికను మేఘా గ్యాస్ రూపొందించింది. అతి తక్కువ పెట్టుబడి అవసరమయ్యే ఆకర్షణీయ ప్యాకేజీలతో పథకాలను సిద్ధం చేసింది. పెట్టే పెట్డుబడిని తర్వాతి కాలంలో తరుగుదల రూపంలో తిరిగి పొందే విధంగా ఈ ప్రణాళికలు ఉండడంతో పరిశ్రమలు మేఘా గ్యాస్ను వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.