కొరటాల శివ దర్శకుడిగా చేసిన సినిమాలన్నిటికీ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ చేసాడు. ఆచార్య సినిమాకు మాత్రం అతడిని వద్దనుకుని వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మను పెట్టుకున్నారు. చిరంజీవి పట్టుబట్టడం వల్ల కొరటాల ఈ మార్పు చేసినట్టు చెప్పుకున్నారు. దేవిశ్రీప్రసాద్ కూడా మంచి ఫామ్‌లో లేకపోవడంతో కొరటాల శివ తన ఛీఫ్ టెక్నీషియన్ని మార్చక తప్పలేదు.
అయితే ‘ఆచార్య’ తర్వాత చేసే సినిమాకు ఎప్పటిలా దేవి వుంటాడనే భావిస్తున్నారు. అల్లు అర్జున్‌తో కొరటాల శివ సినిమా అనౌన్స్ అయింది కానీ సంగీత దర్శకుడి పేరు వేయలేదు. ఆచార్యకు మణిశర్మ చేస్తోన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి కొరటాల శివ ఫిదా అయిపోయాడని, అంచేత బన్నీ సినిమాకు కూడా ఆయనే రిపీట్ అవ్వవచ్చునని టాక్ వినిపిస్తోంది.
ఆచార్యకు ఎలాగో వేరే సంగీత దర్శకుడితో పని చేసాడు కనుక తమన్‌ని తీసుకోమని అల్లు అర్జున్ సూచిస్తున్నాడని మరో టాక్ వుంది. పుష్ప చిత్రానికి దేవిని మార్చాలని అల్లు అర్జున్ పట్టుబట్టినా సుకుమార్‌కి అతనితో వున్న అనుబంధం వల్ల అది కుదర్లేదని భోగట్టా. మరి దేవిశ్రీప్రసాద్‌ని కొరటాల శివ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా, కేవలం ఒక్క సినిమాకు మాత్రమే బ్రేక్ పడిందా అనేది అల్లు అర్జున్ సినిమా పనులు మొదలయితే కానీ తెలియదు.