139 మంది అత్యాచారం కేసులో కొత్త ట్విస్ట్

నల్గొండకు చెందిన ఓ యువతి తనను కొన్నేళ్లుగా 139 మంది అత్యాచారం చేశారంటూ సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా.. ఆ…

నల్గొండకు చెందిన ఓ యువతి తనను కొన్నేళ్లుగా 139 మంది అత్యాచారం చేశారంటూ సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా.. ఆ కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. యువతి చెబుతున్న లిస్ట్ లో యాంకర్ ప్రదీప్, సినీనటుడు కృష్ణుడు లాంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఇప్పుడీ కేసు కొత్త మలుపు తిరిగింది.

బడా బాబులు, సెలబ్రిటీల పేర్లు ఉండడంతో ఇందులోకి డాలర్ బాయ్ అనే వ్యక్తి ఎంటరయ్యాడు. 3 రోజుల కిందట సదరు యువతిని బెదిరింది కొంతం కీలక సమాచారాన్ని, మరికొంతమంది సెలబ్రిటీల వివరాల్ని తీసుకున్నాడు. ఈ కేసు పేరిట సదరు సెలబ్రిటీలకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడాలనేది ఇతడి దురుద్దేశం.

యువతి ఈ విషయాన్ని కూడా పోలీసులకు చెప్పడంతో ఇప్పుడీ కేసు ఈ మలుపు తీసుకుంది. డాలర్ బాయ్ తో సంభాషణల ఆడియో రికార్డులను ఆమె పోలీసులకు అప్పగించింది. అనంతపురానికి చెందిన డాలర్ బాయ్ అలియాస్ రాజాశ్రీరెడ్డి కోసం పోలీసు వేట సాగిస్తున్నారు.

ఇతడికి ఇంతకుముందే నేర చరిత్ర ఉంది. ఓ స్వచ్ఛంధ సంస్థ పేరిట కార్యాలయం తెరిచి అమ్మాయిలకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేశాడు. ఓ అమ్మాయిని ఇలానే మాయచేసి, ఆమె ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని లోబరుచుకున్నాడు. రెండేళ్ల కిందట ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ కట్నం కోసం వేధించడంతో ఆమె కొన్నాళ్ల కిందట పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.

ప్రస్తుతం పోలీసులు డాలర్ బాయ్ కు చెందిన ఆఫీస్ ను సీజ్ చేశారు. అతడి కార్యాలయం నుంచి కొంతమంది అమ్మాయిలకు చెందిన సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు. యువతిని 139 మంది అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఎంతమందికి ఈ డాలర్ బాయ్ ఫోన్లు చేసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడనేది ఇంకా తేలాల్సి ఉంది. 

పవన్ సార్ గురించి ఏం చెప్పాలి