వాళ్లిద్దరి లవ్ స్టోరీ గురించి గతంలో అనేక కథనాలు వచ్చాయి. వారిద్దరూ సహజీవనంలో ఉన్నారనే మాట కూడా వినిపించింది. ఇక పెళ్లే తరువాయి అనేంత లెవల్లో వార్తల్లో నిలిచారు కత్రినాకైఫ్, రణ్ బీర్ కపూర్.
కొన్నాళ్లు పాటు ఒకే లవ్ నెస్ట్ లో బస చేసిన ఈ జంట ఆ తర్వాత విడిపోయింది. పెళ్లి చేసుకోబోతున్నారనేంత వరకూ వచ్చి విడిపోయింది ఈ ప్రేమ జంట. ఆ తర్వాత రణ్ బీర్ మరో లవ్ స్టోరీని మొదలుపెట్టాడు. అలియా భట్ తో రణ్ బీర్ ప్రేమకథ కొనసాగుతూ ఉంది.
ఇంకోవైపు కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ ల ప్రేమ మొదట రూమర్లుగా మొదలై, ఇప్పుడు పెళ్లి వరకూ వచ్చినట్టుగా ఉంది. ఈ ఏడాది డిసెంబర్లో వీరి పెళ్లి జరగబోతోందనేది బీ టౌన్ టాక్. డిసెంబర్లో రాజస్థాన్ లో వీరి పెళ్లి జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు వీరు తమకు కావాల్సిన వారికి సమాచారాన్ని చెప్పారట.
ఒకవైపు కత్రినాకైఫ్ పెళ్లి గురించి ఇలాంటి కథనాలు వస్తుండగా, మరోవైపు రణ్ బీర్ పెళ్లి గురించి కూడా కొత్త అప్ డేట్స్ వస్తున్నాయి. అలియా, రణ్ బీర్ లు పెళ్లి పీటలెక్కబోతున్నారని కొన్నాళ్లుగా ఊహాగానాలున్నా, ఇప్పుడు అందుకు డేట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నారట. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో వీరి పెళ్లి జరగబోతోందట. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోనున్నారట ఈ బాలీవుడ్ హీరో, హీరోయిన్.
మరి ఒకానొక సమయంలో సహజీవనం చేసిన జంటగా నిలిచిన రణ్ బీర్, కత్రినాల పెళ్లి వార్తలు ఒకేసారి వస్తున్నాయి. పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం పొందిన జంట .. వేర్వేరు వ్యక్తులతో పెళ్లి పీటలను ఎక్కబోతున్నట్టుంది.