అగ్ర హీరోలు బయటికొచ్చేది అప్పుడే

ఇండియాలో కరోనా కేసుల ఉధృతి అసలేమాత్రం తగ్గలేదు. అయితే కరోనాతో కలిసి జీవించక తప్పదనే నిజాన్ని అంగీకరించి చాలా మంది రొటీన్‌లో పడిపోయారు. సినిమా వాళ్లు కూడా పూర్తిగా కేసులు తగ్గే వరకు వేచి…

ఇండియాలో కరోనా కేసుల ఉధృతి అసలేమాత్రం తగ్గలేదు. అయితే కరోనాతో కలిసి జీవించక తప్పదనే నిజాన్ని అంగీకరించి చాలా మంది రొటీన్‌లో పడిపోయారు. సినిమా వాళ్లు కూడా పూర్తిగా కేసులు తగ్గే వరకు వేచి చూడాలని భావించారు. కానీ పరిస్థితి ఎప్పటికి సాధారణం అవుతుందనేది అర్థం కావట్లేదు. అందుకే ఇక మీడియం రేంజ్ సినిమాలను మొదలు పెట్టాలనే నిర్మాతలు నిర్ణయించుకున్నారు.

కానీ అగ్ర హీరోలు మాత్రం ఇప్పుడే బయటకు రావడానికి ఇష్టపడడం లేదు. ఆర్.ఆర్.ఆర్., ఆచార్య, వకీల్ సాబ్, రాధేశ్యామ్ మినహా పెద్ద సినిమాల షూటింగ్స్ ఏవీ మొదలు కాలేదు. అసలు మొదలే కాని సినిమాలను ఇప్పుడు హడావుడిగా ఎందుకు స్టార్ట్ చేయాలని పలువురు హీరోలు పరిస్థితి మెరుగయ్యే వరకు ఎదురు చూడాలనే డిసైడ్ అయ్యారు.

ఇక నిర్మాణ దశలో వున్న భారీ చిత్రాలను అప్పుడే మొదలు పెట్టడానికి హీరోలు సుముఖంగా లేరు. ఆచార్య చిత్రాన్ని నవంబరులో మొదలు పెట్టవచ్చునని చిరంజీవి చెప్పినట్టు సమాచారం. పవన్‌కళ్యాణ్ అయితే ఈ ఏడాది చివరివరకు షూటింగ్ చేయబోవడం లేదట. ఎన్టీఆర్, చరణ్ కూడా సాధారణ స్థితి వచ్చేవరకు వేచి చూడాలనే అనుకుంటున్నారట. ప్రభాస్ సినిమాకు విదేశీ వీసాలు, పర్మిషన్లు గట్రా అవసరం కనుక అది కూడా నవంబర్‌కే మొదలు కావచ్చు. ఎలాగో ఇన్ని నెలలు ఎదురు చూసారు కనుక మరో రెండు నెలల పాటు వేచి చూస్తే ప్రమాదం దాటిపోతుందని మన హీరోలు భావిస్తున్నారు.