తననెవరైనా ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడ్తానని జనసేనాని పవన్‌కల్యాణ్ వైసీపీ మంత్రులను ఉద్దేశించిన ఘాటు హెచ్చరిక చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ అన్నంత పని…మంత్రి గుడివాడ అమర్నాథ్ తన మాటల ద్వారా చేశారు. పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గురించి వెటకారంగా పవన్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ మంత్రి పేరు గుర్తు లేదని, వాడు, సన్నాసి అంటూ పవన్ తిట్లు తిట్టారు. ఇందుకు మంత్రి అమర్నాథ్ ఘాటైన పదజాలంతో కౌంటర్ ఇచ్చారు.
పవన్‌ను రాజకీయ వ్యభిచారి అని తీవ్రంగా విమర్శించారు. పంచ్ డైలాగ్‌లతో పవన్‌ను ఓ రేంజ్‌లో ఆయన ఆడుకున్నారు. తన రాజకీయ నేపథ్యం ఏంటో వివరించారు. పెందుర్తి నియోజక వర్గం స్థాపించినప్పుడు తన తాత ఎమ్మెల్యే అని చెప్పారు. నువ్వు లాగులేసుకుని తిరుగుతున్నావేమో అని దెప్పి పొడిచారు. పుట్టావో లేదో కూడా తెలియదన్నారు. ఇలాంటి వ్యక్తి వచ్చి తమ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. నోరుంది కదా, సినిమా డైలాగ్‌లు రాసేవాళ్లు పక్కనున్నారు కదా, ఏదైనా అనొచ్చనే ఆలోచన నీది అని పవన్‌ను ఉద్దేశించి అన్నారు. పోరాటం తప్ప ఏమీ తెలియదని మొదట అన్నాడని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత చివరికి ఏమైందని ప్రశ్నించారు. ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణమే అని అన్నాడని, ఈ ముక్కేదో మొదటే చెప్పొచ్చు కదా అని వెటకారం చేశారు.
మనకెట్లా శీలం లేదు.. గంజాయి శీలవతి పేరు తెచ్చి పెట్టుకున్నట్లుందని పంచ్ విసిరారు. పవన్ కల్యాణ్‌కు ఉన్నవి నారావారి నరాలు, కమ్మని పసుపు రక్తం అని విమర్శించారు. జనసేన పేరు తీసి చంద్రసేనా అని పెట్టుకుంటే బాగుంటుందని హితబోధ చేయడం గమనార్హం. ఆంబోతు గమ్యం లేకుండా ఎలా పరిగెడుతుందో అలా ఉంది పవన్ స్పీచ్ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆంబోతు రంకెలు నీ నోటి నుంచి వచ్చిన రంకెలు ఒకలాగే ఉందని చెప్పుతో కొట్టినట్టు మంత్రి మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీలా సన్నాసి రాజకీయ చేసే కుటుంబం తనది కాదని అన్నారు.
అన్ని సినిమాల డైలాగులు ఓకే సినిమాలో చెప్తే ఎలా..ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పేరు తెలియక పోవచ్చని.. భార్య పిల్లలు పేర్లు చెప్పగలవా..? అని పవన్‌ను మాటలతో చితక్కొట్టారు. సంక్రాంతి పండుగ ముందు వెళ్లి సంక్రాంతి మామూలు తీసుకొచ్చి మాట్లాడతావని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎక్కువ కాలం పాలించిన టీడీపీ గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు. 2014లో పార్టీ పెట్టినప్పుడే చంద్రబాబును పెళ్లి చేసుకున్నావని వ్యంగ్యంగా అన్నారు. ఇంతకీ భార్య నువ్వా ఆయనా చెప్పాలంటూ మంత్రి అమర్నాథ్ దుమ్ము దులిపారు.