పవన్ కళ్యాణ్ రాజకీయ టూరు భాగంగా ఉత్తరాంధ్రలో జనసేన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. ప్రతి మీటింగ్ లోను ఊగిపోయినట్లే ఈ సారి కూడా అదే రీతిలో తన ప్రసంగాన్ని చదివి వినిపించారు. వైయస్ఆర్ తో మొదలు కొని… వైయస్ జగన్ వరకు దాదాపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులందరిపైనా నోటికి వచ్చినట్లు మాట్లాడారు. అందులో ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందిన మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
పవన్ సభలో మాట్లాడుతూ మంత్రి అంబటిని 'సంబరాల రాంబాబు' అని హేలనగా మాట్లాడారు. పవన్ మాటల్లో తాను ఎమ్మెల్యే కాలేకపోయిన బాధ కంటే తన సామాజిక వర్గం వారు మంత్రులుగా ఉన్నారనే బాధ కనపడిండి. పవన్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు.
మంత్రి అంబటి ట్వీట్టర్ లో పవన్ ఉద్దేశిస్తూ… 'పీకే అంటే పిచ్చి కుక్క' అని… “నేను సంబరాల రాంబాబునైతే… నువ్వు కల్యాణాల పవన్ వి!” అంటూ సెటైర్ వేశారు. అలాగే మంత్రి రోజాపై పవన్ అన్న మాటలకు కౌంటర్ ఇచ్చారు. 'రోజా డైమండ్ రాణి అయితే.. నువ్వు బాబు గారి జోకర్ వి!' అంటూ ట్వీట్ చేశారు.
ఎంత సేపు వైసీపీ పార్టీ నాయకులపైనా, సీఎం జగన్ పైనా వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పా తనకు రాజకీయంగా ఆవకాశం ఇవ్వమని… ఆవకాశం ఇస్తే ప్రజలకు ఏం చేస్తానో చెప్పకపోవడం సభలో విశేషం. పవన్ రాజకీయం మొత్తం చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టుకోవడం వల్లే వైసీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారనే మాటలకు నిజం చేయడంలో పవన్ ముందు వరుసలో ఉంటున్నారు.