బాలీవుడ్ లో మరో పెళ్లి బాజా

న్యూ ఇయర్ లో మరో సెలబ్రిటీ వివాహం జరగబోతోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి పెళ్లికి రెడీ అయింది. కొన్నాళ్లుగా క్రికెటర్ కేఎల్ రాహుల్ తో ఈమె డేటింగ్…

న్యూ ఇయర్ లో మరో సెలబ్రిటీ వివాహం జరగబోతోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి పెళ్లికి రెడీ అయింది. కొన్నాళ్లుగా క్రికెటర్ కేఎల్ రాహుల్ తో ఈమె డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు.

బాలీవుడ్ నుంచి వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం, వీళ్లిద్దరి పెళ్లి ఈనెల 23న జరగనుంది. వీళ్ల పెళ్లి ఖండాలాలో జరగబోతోంది. ఖండాలాలో సునీల్ శెట్టికి పెద్ద బంగ్లా ఉంది. అందులో పెళ్లి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 21వ తేదీతో మొదలయ్యే పెళ్లి వేడుకలు 3 రోజుల పాటు జరుగుతాయి.

టీమిండియా, బాలీవుడ్ మధ్య బంధానికి గుర్తుగా చాలామంది పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి చేరబోతున్నారు. కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న వీరిద్దరూ పెద్దల అనుమతితో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. తమ పెళ్లిపై కొన్నాళ్లుగా వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ.. డేట్ ఫిక్స్ చేసుకున్నారు.

ఇరు కుటుంబాల బంధుమిత్రులు, స్నేహితులతో పాటు.. బాలీవుడ్ కి, క్రికెట్ కు చెందిన స్టార్లు ఈ వివాహానికి హాజరవుతారట. అతిథులకు ఆహ్వాన పత్రికలు కూడా పంపిస్తున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, అక్షయ్ కుమార్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీతో పాటు మరికొందరు ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేయబోతున్నారు.