ఈ రికార్డు జగన్ ఏలుబడిలోనే…!

జగన్ ప్రభుత్వం ఏమి చేసింది. ఏపీకి ర్యాంకులు ఏ రంగంలో చూసినా ఏముంది అంటూ వేడి నిట్టూర్పులతో పాటు విమర్శలు చేసేవారికి అతి పెద్ద దెబ్బ పడేలా వారి నోరు మూతపడేలా ఒక సంచలన…

జగన్ ప్రభుత్వం ఏమి చేసింది. ఏపీకి ర్యాంకులు ఏ రంగంలో చూసినా ఏముంది అంటూ వేడి నిట్టూర్పులతో పాటు విమర్శలు చేసేవారికి అతి పెద్ద దెబ్బ పడేలా వారి నోరు మూతపడేలా ఒక సంచలన సర్వే వివరాలు బయటకు వచ్చాయి. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సిటిజన్ పర్సెప్షన్ సర్వేను తాజాగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రజల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు.

ఈ సర్వేలో  దేశంలో నివాసయోగ్యమైన నగరాల జాబితాలో టాప్ టెన్ లో మూడు ఏపీలోనే ఉండడం అంటే గర్వకారణమే. ఆ విధంగా దేశంలోనే ఏపీ తన సత్తాను గట్టిగా చాటుకుంది. ఈ సర్వే వివరాల ప్రకారం చూస్తే 5 లక్షల నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో జాతీయ స్థాయిలో గుంటూరుకు ఆరో ర్యాంక్ లభించింది. విజయవాడ నుంచి 3.32 లక్షల మంది పాల్గొనగా విశాఖ నుంచి 2.88 లక్షల మంది సర్వేలో అభిప్రాయాలు చెప్పారు. ఈ రెండింటికీ వరుసగా 8, 9వ స్థానాలు లభించడం విశేషం.

ఈ సర్వే ప్రకారం చూస్తే ఏపీలో నివాసయోగ్యమైన నగరాలుగా మూడు చోటు దక్కించుకున్నాయి. ప్రజలు ఈ నగరాలలో తాము మంచి జీవితాన్ని నాణ్యమైన జీవితాన్ని గడుపుతున్నామని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న అనేక నిర్ణయాల ప్రభావం కూడా నివాసం ఉండే నగరాల మీద పడుతుంది. ఏపీలో నాలుగేళ్ళుగా సాగుతున్న వైసీపీ ఏలుబడిలో నివాసయోగ్యమైన నగరాల జాబితా మూడుకు చేరుకోవడం అంటే మంచి రికార్డు గానే చూడాలి.

భవిష్యత్తులో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. నగరాలు అంటే నివాసయోగ్యంగా ఉండాలి, అందరూ అందులో జీవించాలి అన్నదే వైసీపీ విధానం. అందుకే అమరావతి వంటి కాస్ట్లీ రాజధానిని పక్కన పెట్టి  విశాఖ రాజధానికి మొగ్గు చూపుతున్నారు. ఇపుడు నివాసయోగ్యమైన నగరంగా విశాఖ ఉండడం అంటే సర్వే ప్రకారం చూసినా బెస్ట్ సిటీ బెస్ట్ క్యాపిటల్ గా విశాఖ ఉండగలదు అన్నది రుజువు అయింది అంటున్నారు.