వీరసింహా ను వీరయ్య తట్టుకోగలడా?

విడివిడిగా వస్తే ఎలా వుండేదో కానీ పోటా పోటీగా వస్తుంటే వేడి తెలుస్తోంది. బాలయ్య వీరసింహా రెడ్డి టోటల్ గా ఎడ్జ్ తీసేసుకుంది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియా అన్నీ కలిసి…

విడివిడిగా వస్తే ఎలా వుండేదో కానీ పోటా పోటీగా వస్తుంటే వేడి తెలుస్తోంది. బాలయ్య వీరసింహా రెడ్డి టోటల్ గా ఎడ్జ్ తీసేసుకుంది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియా అన్నీ కలిసి సినిమాకు భయంకరమైన బజ్ ను తీసుకువచ్చేసాయి. ఏ మాటకు ఆ మాట..బన్నీ, చరణ్, పవన్ సంగతేమో కానీ మెగాస్టార్ మాత్రం సోషల్ మీడియాలో బాగా అంటే బాగా వీక్ గా వున్నారని అర్థం అయిపోతోంది. దాంతో ఎక్కడ చూసినా, యుఎస్ నుంచి తెలంగాణ, ఆంధ్ర వరకు బాలయ్య సినిమా హల్ చల్..హడావుడి కనిపిస్తోంది. దీని ముందు వీరయ్య హడావుడి తక్కువగానే కనిపిస్తోంది.

ఇండస్ట్రీలో ఓ సెక్షన్ ఆఫ్ నిర్మాతలు బెనిఫిట్ షో లను భుజాన వేసుకున్నారు. తెల్లవారు ఝామున 4 గంటలకు మల్టీ ఫ్లెక్స్ లో 200 వందలకు టికెట్ లు వున్నా, అదే టైమ్ లో మూడు బెనిఫిట్ షో లు రెండు వేల టికెట్ వంతున ఏర్పాటు చేసేసారు. ఈ టికెట్లు అన్నీ ఇండస్ట్రీ నిర్మాతలే కొనేయడం విశేషం. కానీ వీరయ్య సినిమాకు బెనిఫిట్ షో వేసేవారే కనిపించడం లేదు. రాజకీయ, సినిమా ప్రముఖులు చాలా షో ల వంతున తీసేసుకోవడం విశేషం.

ఇదంతా హైదరాబాద్ లో పరిస్థితి. ఆంధ్రలో కూడా ఇంతకు మించిన పరిస్థితి వుందని తెలుస్తోంది. హైదరాబాద్ తో పోల్చుకుంటే ఆంధ్రలో వీరయ్య పరిస్థితి కొంచెం మెరుగ్గా వుంది. కానీ అక్కడ కూడా బాలయ్య సినిమా విషయంలో రాజకీయ హడావుడి ఎక్కువగా వుంది. మెగాస్టార్ కు అది మైనస్ గానే వుంది.

నైజాంలో బాలయ్య సినిమా డే వన్ రికార్డు చూపించే పరిస్థితి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్ లో సినిమా పూర్తి కాకుండానే పాజిటివ్ రివ్యూలు స్ఫ్రెడ్ చేయడానికి అంతా సిద్దమైపోయినట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో మెగాస్టార్ ఈ ధాటిని తట్టుకోడవం కష్టమే. మెగా ఫ్యాన్స్ అంతా యంగ్ బ్యాచ్ వేరుగా మారిపోయారు. బన్నీ, చరణ్, పవన్ ఫ్యాన్స్ గా మారిపోయారు. చిరు ఫ్యాన్స్ అంతా ఫిఫ్టీ ప్లస్ లు అయిపోయారు. వాళ్లు ఈ సోషల్ మీడియా హడావుడికి దూరం.

కానీ నందమూరి ఫ్యాన్స్ యునైట్ గా వున్నారు. బాలయ్య అయినా ఎన్టీఆర్ అయినా కలిసి కట్టుగా వున్నారు. అదే వారికి ప్లస్ పాయింట్. వీరయ్య సినిమా యునానిమస్ టాక్ తెచ్చుకుంటేనే ఈ ధాటిని తట్టుకోగలదు. లేదంటే కష్టం కావచ్చు.