కఠిన నిర్ణయం అంటున్న చంద్రబాబు

తాను కఠిన నిర్ణయం దిశగా ఆలోచిస్తాను అని తమ్ముళ్ళకు టీడీపీ అధినేత చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. చంద్రబాబు ఎపుడూ స్మూత్ గానే ఏ వ్యవహారం అయినా డీల్ చేస్తారు అని పార్టీలో అత్యధికులు…

తాను కఠిన నిర్ణయం దిశగా ఆలోచిస్తాను అని తమ్ముళ్ళకు టీడీపీ అధినేత చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. చంద్రబాబు ఎపుడూ స్మూత్ గానే ఏ వ్యవహారం అయినా డీల్ చేస్తారు అని పార్టీలో అత్యధికులు నమ్మే మాట. కానీ ఈసారి ఎన్నికలు టీడీపీకి చావో రేవో లాంటివి అన్నది తెలిసిందే.

అందువల్ల గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని టీడీపీ హై కమాండ్ ఆలోచిస్తోంది. ప్రతీ నియోజకవర్గం చాలా ఇంపార్టెంట్ అని భావిస్తోంది. ముఖ్యంగా వర్గ పోరు లేకుండా చూసుకోవడంతో పాటు ఎవరికి టికెట్ ఇచ్చినా అంతా కలసి ఏకత్రాటి  మీద నిలిచి పనిచేయాలని టీడీపీ అధినాయకత్వం ఆదేశిస్తోంది.

ఈ క్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి పార్టీ సమీక్షలో బాబు కీలక కామెంట్స్ చేశారని అంటున్నారు. వర్గ పోరుతో వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు అని బాబు అంటున్నారు. అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ వర్గాల మధ్య పార్టీ నలిగిపోతోంది. ఈ ఇద్దరూ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అనకాపల్లిలో రెండు గ్రూపులుగా పార్టీ ఉందని అంటున్నారు. దాంతో చంద్రబాబు ఇక మీదట అలా ఉండడానికి వీలు లేదని హెచ్చరించారు.

పార్టీ కోసం అంతా పనిచేయాలని పనిమంతులకే టికెట్ అని చెప్పేశారు. ఒక వేళ ఎవరైనా పార్టీ లైన్ దాటితే మాత్రం సహించేది లేదని అపుడు తాను కఠిన నిర్ణయం దిశగా వెళ్తానని చెప్పేశారు. ఒక్క అనకాపల్లి అని కాదు చాలా చోట్ల టీడీపీలో వర్గ పోరు ఉంది. టికెట్ రేసులో ఉన్న వారు పై చేయి సాధించాలని చూస్తున్నారు. చంద్రబాబు కఠిన వైఖరి అన్నది మాటల నుంచి చేతలకు వస్తే మాత్రం టీడీపీలో చాలా పరిణామాలే చోటు చేసుకుంటాయని అంటున్నారు.