ఏమిటీ యాక్షన్ …విశాల్?

డబ్బింగ్ సినిమాల మార్కెట్ ఢమాల్ మనేసిన కాలం ఇది. అలాంటి టైమ్ లో ఖాకీ, డిటెక్టివ్, ఖైదీ, అభిమన్యుడు, విజిల్ ఇలాంటి కొన్ని సినిమాలు ఓకె అనిపించుకుని మళ్లీ కాస్త ఆశలు పెంచాయి. మళ్లీ…

డబ్బింగ్ సినిమాల మార్కెట్ ఢమాల్ మనేసిన కాలం ఇది. అలాంటి టైమ్ లో ఖాకీ, డిటెక్టివ్, ఖైదీ, అభిమన్యుడు, విజిల్ ఇలాంటి కొన్ని సినిమాలు ఓకె అనిపించుకుని మళ్లీ కాస్త ఆశలు పెంచాయి. మళ్లీ డబ్బింగ్ సినిమాల మార్కెట్ ఇప్పడిప్పుడే కాస్త ఊపిరిపోసుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో విశాల్ లేటెస్ట్ సినిమా యాక్షన్ కు తెలుగు నాట అయిదు కోట్ల రూపాయల రేటు పలికింది. 

కానీ అలాంటి సినిమాకు పబ్లిసిటీ ని మాత్రం విశాల్ పట్టించుకున్నట్లు లేదు. ఖైదీ సినిమా విషయంలో హీరో కార్తి చాలా కేర్ తీసుకున్నాడు. ఒకటికి రెండు సార్లు వచ్చి మీడియాను కలిసి, ఇంటర్వూలు ఇచ్చి, మీట్ లు నిర్వహించాడు. కానీ నిన్నటికి నిన్న యాక్షన్ ప్రీరిలీజ్ ఈవెంట్ పెడితే, విశాల్ అసలు వస్తాడా?రాడా?అనిపించేసాడు. 

తమన్నా వచ్చిన గంట తరువాత కానీ విశాల్ రాలేదు. దాంతో విశాల్ వచ్చిన కొద్ది సేపటికే తమన్నా ఫ్లయిట్ టైమ్ అయిపోతోంది అంటూ వెళ్లిపోయింది. ఫంక్షన్ కు సరైన గెస్ట్ లు కరువయ్యారు. సరే, ఫంక్షన్ అయిన మర్నాడు విశాల్ రోజల్లా వుండి మీడియాను కలిసి, ఇంటర్వూలు ఇచ్చి, సినిమా కోసం ప్రచారం చేసి వెళ్తాడు అని ప్లాన్ చేసారు. కానీ అవేమీ చేయకుండానే విశాల్ లండన్ జంప్ అన్నాడు. దాంతో ప్రోగ్రామ్ లు అన్నీ క్యాన్సిల్ అన్నారు.

మరోపక్కన అయిదు కోట్లు పెట్టి కొన్న యాక్షన్ సినిమాకు ఆంధ్రనే అయిదు కోట్లు రేటు ఫిక్స్ చేసారని బోగట్టా. అనుకున్న రేటు రాని చోట్ల డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. అందువల్ల కచ్చితంగా సినిమా హిట్ అయి తీరాలి. అందుకు తగ్గ రేంజ్ లో ప్రచారం వుండాలి. ఇలాంటి టైమ్ లో విశాల్ ఇలా చేయడం ఏమిటో?