విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా ' వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ సినిమా ఆల్ మోస్ట్ పూర్తయిపోయింది. డిసెంబర్ లో విడుదల అని కూడా వినిపించింది. కానీ ఇప్పడు పరిస్థితి చూస్తుంటే అసలు ఫిబ్రవరి వరకు వచ్చేలా కనిపించడం లేదు. సినిమా పూర్తి అయిన తరువాత తను చూసి, పూర్తిగా ఓకె అనిపించాక, విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తానని హీరో విజయ్ క్లియర్ గా చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో డేట్ అనౌన్స్ చేయలేదు.
డిసెంబర్ లో డేట్ లు సరైనవి లేవు. వెంకీమామ సినిమానే 6,13,25 అంటూ మీనం మేషం లెక్కలు పెడుతోంది. వరల్డ్ ఫేమస్ లవర్ కనుక ఇదే డేట్ లను పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పటికే పబ్లిసిటీ హడావుడి మొదలు పెట్టి వుండేది. అలాంటిదేం జరగడం లేదు. పోనీ బోలెడు బజ్ వుంది, అందువల్ల లేటుగా ప్రచారం స్టార్ట్ చేసినా ఫరవాలేదు అని అనుకోవడానికీ లేదు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా మొత్తం విజయ్ తన భుజాలమీదే మోయాల్సి వుంది.
డిసెంబర్ వదిలేస్తే, జనవరిలో ఇప్పటికే అయిదు సినిమాలు డేట్ లు అనౌన్స్ చేసాయి. ఇక మిగిలింది ఫిబ్రవరినే. ఆ నెల 14 లవర్స్ డే కనుక, పైగా ఆరోజు శుక్రవారం పడింది కనుక, అదే డేట్ కు విజయ్ సినిమా విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.