అదిగో ఎన్టీఆర్.. ఇదిగో బ్యానర్

శంఖంలో పోస్తే నీళ్లు కాస్తా తీర్థం అయిపోతాయని ఓ మాట. మీడియాలో ఎవరో ఒకరు రాస్తే అదే నిజమై కూర్చుంటుందని ఈకాలం మాట. ఉన్నట్లుండి ఇలాంటి వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. ఎన్టీఆర్ స్వంత…

శంఖంలో పోస్తే నీళ్లు కాస్తా తీర్థం అయిపోతాయని ఓ మాట. మీడియాలో ఎవరో ఒకరు రాస్తే అదే నిజమై కూర్చుంటుందని ఈకాలం మాట. ఉన్నట్లుండి ఇలాంటి వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది. ఎన్టీఆర్ స్వంత బ్యానర్ పెడుతున్నారు అన్నది ఆ వార్త. అందరు హీరోలకు బ్యానర్లు వున్నాయి కదా? ఎన్టీఆర్ ఏం తక్కువ తిన్నారు. అందుకే అది నిజమై వుంటుంది అనుకుని, మిగిలిన జనాలు అంతా ఫాలో..ఫాలో..ఫాలో అయిపోయి, వార్తలు రాసేసారు. 

కానీ విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ బ్యానర్ అన్నది ఇప్పట్లో కాదు, చాలా కాలం తరువాత కూడా ఉండకపోవచ్చు అన్నది. కళ్యాణ్ రామ్ బ్యానర్ నే ఎన్టీఆర్ బ్యానర్ కూడా. రాబోయే త్రివిక్రమ్ సినిమా కూడా హారిక హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద వుంటుంది తప్ప, వేరే కొత్త బ్యానర్ ఏదీ పుట్టుకురావడం లేదు.

నిజానికి ఇక్కడ విషయం ఒకటి వుంది. ఎన్టీఆర్ వ్యవహారం మిగిలిన హీరోల వ్యవహారానికి కాస్త భిన్నమైన సంగతి ఇది. డబ్బుల విషయంలో రిస్క్ అనే దానికి ఎన్టీఆర్ దూరంగా వుంటారు. ఈ రిస్క్ కు దూరంగానే ఎన్టీఆర్ ఇన్ వెస్ట్ మెంట్ లు వుంటాయి. అంతే తప్ప దూసుకుపోయి వ్యవహరించరు. అందువల్ల సినిమా నిర్మాణం అన్నది ఆయనకు దూరం. 

పోనీ పేరుకు బ్యానర్ పెట్టి, రిస్క్ లేని వాటా తీసుకునే వ్యవహారం అంటే, దానికే కళ్యాణ్ రామ్ బ్యానర్ వుంది. అంతకు మించి అయితే ఎన్టీఆర్ ప్రస్తుతానికి ఏ ఆలోచన చేయడం లేదు. అదీ విషయం.