తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. తెలంగాణకు సోమేశ్ కేటాయింపును రద్దు చేస్తూ… ఆంధ్రప్రదేశ్ కి వెళ్లాలని సూచించింది.
రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం సోమేశ్ కుమార్ కు ఏపీ క్యాడర్ కు కేటాయించడంతో సోమేశ్ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించడంతో .. కేంద్రం ఉత్తర్వులను ఆపి తెలంగాణలో కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులతో సోమేశ్ తెలంగాణలో కొనసాగుతున్నారు. 2019, డిసెంబర్ నుంచి తెలంగాణ సీఎస్‌గా సోమేశ్ కుమార్ కొనసాగుతున్నారు.
క్యాట్ ఉత్తర్వులు కొట్టేయాలని కేంద్రం 2017లో హైకోర్టు కు వెళ్లడంతో.. ఇవాళ క్యాట్ ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సోమేశ్ అభ్యర్ధనతో హైకోర్టు తీర్పు 3 వారాల పాటు నిలిపివేసింది.