టబు – భలే మంచి చౌకబేరము

హీరో సినిమాకు నిర్మాత వేరేవాళ్లు అయితే కొండ మీద కోతిని హీరోయిన్ గా కావాలంటారు. అదే స్వంత బ్యానర్ అయితే ఇక్కడ..ఇలా అడ్జస్ట్ అవుదాం సరిపోతుంది అనుకుంటారు. హీరో నితిన్ ఫాదర్ సుధాకర రెడ్డి…

హీరో సినిమాకు నిర్మాత వేరేవాళ్లు అయితే కొండ మీద కోతిని హీరోయిన్ గా కావాలంటారు. అదే స్వంత బ్యానర్ అయితే ఇక్కడ..ఇలా అడ్జస్ట్ అవుదాం సరిపోతుంది అనుకుంటారు. హీరో నితిన్ ఫాదర్ సుధాకర రెడ్డి ప్రస్తుతం ఇలాగే ఆలోచిస్తున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

విషయం ఏమిటంటే అంథాదూన్ సినిమాను తెలుగులో చేయబోతున్నారు నితిన్. ఈ సినిమాలో కీలకమైన పాత్రను హిందీలో సీనియర్ హీరోయిన్ టబు చేసింది. కానీ తెలుగులో మళ్లీ టబునే తీసుకోవడమా? అన్న ఆలోచన చేసారు. ఎందుకంటే అలవైకుంఠపురములో లాంటి కలర్ ఫుల్, కాస్ట్లీ సినిమాలోనే టబు ఎలా వుందో, ఎలా కనిపించిందో అంతా చూసారు.

అందుకే ఇలియానా దగ్గర నుంచి నయనతార మీదగా ప్రియమణి వరకు చాలా పేర్లు పరిశీలనకు వచ్చాయి. నయనతార మాంచి ఛాయిస్. కానీ ఆమె తొమ్మిది కోట్లు కోట్ చేసి, ఏడు కోట్ల దగ్గర ఆగిందని గ్యాసిప్ లు వచ్చాయి. అయిదారు వరకు వెళ్తే పని జరిగేదేమో? 

కానీ హీరో నితిన్ తండ్రి సుధాకరరెడ్డినే నిర్మాత కావడంతో, అంత అవసరమా? అన్న ఆలోచనతో పక్కన పెట్టారు. ఇప్పుడు వాళ్లని చూసి, వీళ్లను చూసి, ఆఖరికి టబుతోనే అడ్జస్ట్ అయిపోతే పోలా? అని అనుకుంటున్నారట. ఆమె అయితే మరీ భారీ రేటు అక్కరలేదు. ఓ కోటి రూపాయలకు అటు ఇటుగా మేనేజ్ చేసేయవచ్చు అన్నది ఐడియా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

కానీ నితిన్ శ్రేయస్సు కోరే ఇండస్ట్రీ జనాలు మాత్రం నయనతార కాకపోయినా, ప్రియమణి, మమత మోహన్ దాస్ లాంటి కాస్త మిడిల్ ఏజ్డ్ హీరోయిన్ లను చూడమంటున్నారు. మరి సుధాకరరెడ్డి ఏం చేస్తారో చూడాలి.