బుట్టబొమ్మ..మంచి హుషారు మెలోడీ

సితార సంస్థ నిర్మిస్తున్న చిన్నచిత్రం బుట్టబొమ్మ. ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేసారు. ‘’..పేరు లేని ఊరులోకి కొత్త గాలొచ్చిందా..ఊసుపోక ఊసులెన్నో మోసుకోచ్చిందా..’’ అంటే సాగిన ఈ మాంచి హషారు మెలోడీ…

సితార సంస్థ నిర్మిస్తున్న చిన్నచిత్రం బుట్టబొమ్మ. ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేసారు. ‘’..పేరు లేని ఊరులోకి కొత్త గాలొచ్చిందా..ఊసుపోక ఊసులెన్నో మోసుకోచ్చిందా..’’ అంటే సాగిన ఈ మాంచి హషారు మెలోడీ గీతాన్ని మోహన్ భోగరాజు ఆలపించారు. రచయిత భరద్వాజ పాత్రుడు ఈ గీతాన్ని రచించారు. స్వీకార్ అగస్తి సంగీతం అందించారు. పాట క్యాచీగా వుంది. ఇటు మెలోడీ అనిపించేలా..అటు హుషారుగా వుండేలా ట్యూన్ చేసారు. హీరోయిన్ అనిక సురేంద్రన్ మీద ఈ పాటను మాంచి నాచురల్ లోకేషన్లలో చిత్రీకరించారు.

ఫోన్ స్నేహం నేపథ్యంలో తయారవుతున్న సినిమాలో ఈ పాటను కూడా ఫోన్ వాడకంతోనే చిత్రీకరించారు. సత్య అనే అమ్మాయి చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కునే వ్యక్తి. ఆమె ఎక్కడ ఉన్నా సందడి వాతావరణం నెలకొంటుంది. ఆమె ఇంట్లో తన రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, ఆమె నిరంతరం మొబైల్ ఫోన్‌పై దృష్టి పెడుతుంది. ఆమె ఫోన్ లో ఆటో డ్రైవర్‌తో సంభాషిస్తుంది. అలా ఇద్దరూ ఒకరికొకరు బాగా దగ్గరై ప్రేమలో పడతారు.

అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నవ్య స్వామి, నర్రా శ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి, మిర్చి కిరణ్, కంచరపాలెం కిషోర్, మధుమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 26న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్.నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.