సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన సినిమా “కళ్యాణం కమనీయం”. నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల తో ఈ సినిమా యువి కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల మీడియాతో మాట్లాడారు.
వారాహి సంస్థలో తుంగభద్ర చిత్రానికి పనిచేశాను. ఈ లైన్ అనుకున్న యువి కి వచ్చాను. పెళ్లయ్యాక భర్తకు జాబ్ లేకుంటే భార్య ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అనేది ఈ చిత్రంలో చూపిస్తున్నాం. అయితే అదొక్కటే కాదు ట్రైలర్ లో రివీల్ చేయని చాలా అంశాలు సినిమాలో ఉంటాయి. “కళ్యాణం కమనీయం” అనేది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సకుటుంబంగా చూసేలా సినిమా చేసినందుకు సంతోషంగా ఉన్నాం.
ఇందులో ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న యువ జంటగా సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ నటించారు. శివ శృతి పాత్రల్లో వారి నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ ఇద్దరికీ యాప్ట్ క్యారెక్టర్ ఇవి. యూవీ లాంటి పెద్ద సంస్థలో దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా చూసిన సెన్సార్ వారు కూడా మీరు క్లీన్ యూ సర్టిఫికెట్ తీసుకోమని సజెస్ట్ చేశారు. వాళ్లకూ అంత బాగా నచ్చింది. క్లీన్ యూ సినిమా చేసినందుకు గర్వపడుతున్నాం.
మా చిత్రంలోని అన్ని పాటలకు మంచి స్పందన వస్తోంది. 14నే మా సినిమా విడుదలవుతోంది.