11న ‘సరిలేరు’..12న ‘అల’..ఫిక్స్

మొత్తానికి ఓ సమస్య తీరిపోయింది. రామజన్మభూమి సమస్య పై కోర్టు తీర్పు వచ్చినట్లే, సంక్రాంతి పండుగకు ఢీ అంటే ఢీ అనుకున్న రెండు భారీ సినిమాల మధ్య లోపాయకారీ ఒప్పందం కుదిరిపోయింది. Advertisement కుదిరిన…

మొత్తానికి ఓ సమస్య తీరిపోయింది. రామజన్మభూమి సమస్య పై కోర్టు తీర్పు వచ్చినట్లే, సంక్రాంతి పండుగకు ఢీ అంటే ఢీ అనుకున్న రెండు భారీ సినిమాల మధ్య లోపాయకారీ ఒప్పందం కుదిరిపోయింది.

కుదిరిన అన్ రిటెన్ అగ్రిమెంట్ ప్రకారం సూపర్ స్టార్ మహేష్-అనిల్ రావిపూడిల సినిమా జనవరి 11న విడుదలవుతుంది. స్టయిలిష్ స్టార్-బన్నీల సినిమా 12న విడదులవుతుంది. దీనివల్ల ఇద్దరికీ అడ్వాంటేజ్ అవుతుంది. ముఖ్యంగా మహేష్ కు మరింత అవుతుంది.

ఎందుకంటే మహేష్ సినిమాకు ప్రీమియర్ల అడ్వాంటేజ్, అలాగే ఎక్కువ థియేటర్లలో ఓపెనింగ్ వుంటుంది. బన్నీ సినిమాకు కూడా రెండు రోజులు ఓవర్ సీస్ అడ్వాంటేజ్, ఓపెనింగ్స్ డివైడ్ కాకుండా వుండడం వుంటుంది. 

ఆపైన ఏ సినిమా బాగుంటే, ఆ సినిమా రన్ సాగుతుంది. రెండూ బాగుంటే రెండింటికీ బిజినెస్ బాగుంటుంది.