cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనుష్క రేంజ్ హీరోలకన్నా ఎక్కువే

అనుష్క రేంజ్ హీరోలకన్నా ఎక్కువే

తెలుగులో చాలా అంటే చాలా మంది హీరోల రెమ్యూనిరేషన్ మూడు కోట్లకు మించదు. చిన్న నుంచి మిడిల్ హీరోల వరకు యాభై లక్షల నుంచి మూడు కోట్లు రెమ్యూనిరేషన్ మాత్రమే. కానీ 'దేవసేన' అనుష్క రెమ్యూనిరేషన్ మాత్రం మూడున్నర కోట్లు. ఆమె రేంజ్ అదీ. కేవలం పాపులర్ హీరోయిన్ గా మాత్రమే కాదు, తెలుగు, తమిళం రంగాల్లో సాలిడ్ మార్కెట్ తో పాటు, బాలీవుడ్ మార్కెట్ కూడా వుండడమే అందుకు కారణం. 

ఆమెకు ఇచ్చిన రెమ్యూనిరేషన్ కన్నా ఎక్కువే, ఆమె వుండడం వల్ల బాలీవుడ్, తమిళ, ఇంకా అదర్ సౌత్ లాంగ్వేజ్ ల నుంచి అమ్మకాల రూపంలో వస్తుంది. అందుకే ఆమె హీరోయిన్ గా, మాధవన్ హీరోగా తీసున్న నిశ్శబ్ధం సినిమా మీద పాతిక కోట్లకు ఫైగా ఖర్చుచేసారు. అనుష్కకు మూడున్నర, మాధవన్ కు నాలుగున్నర కోట్ల రెమ్యూనిరేషన్ ల ఇచ్చారు. 

తెలుగు కాపీ రైట్స్ పక్కన పెడితే, అదర్ లాంగ్వేజ్ థియేటర్ రైట్స్ నుంచి, నాన్ థియేటర్ రైట్స్ నుంచే రికవరీ అయిపోతుంది. రెమ్యూనిరేషన్ సంగతి పక్కన పెడితే తెలుగులో మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు ఏవీ ముుఫై కోట్లు అంటే ఇక అంతే సంగతులు. అలాంటిది అనుష్క సినిమా ముఫై కోట్లు అంటే మాత్రం నిర్మాతల హ్యాపీనే.