మెగా కాంపౌండ్ లో ఓ స్క్రిప్ట్ ఓకే చేయించుకున్నోడు నిజంగా మగాడు అనే టాక్ ఉంది ఇండస్ట్రీలో. ఎందుకంటే ఓ కథకు గ్రీన్ సిగ్నల్ పడాలంటే ఎన్నో లేయర్స్ దాటి రావాల్సి ఉంటుంది. కాంపౌండ్ లో కేవలం హీరోను ఒప్పిస్తే సరిపోదు. అల్లు అరవింద్ లాంటి పెద్దలు ఓకే చేయాలి. ఇంకా కీలకమైన ప్రాజెక్టు అనుకుంటే వ్యవహారం మెగాస్టార్ వరకు కూడా వెళ్తుంది. ఇవన్నీ పక్కనపెడితే అసలు సదరు హీరో దగ్గర ఓకే చేయించుకోవడమే పెద్ద సమస్య.
ఇప్పుడిదంతా ఎందుకంటే, గతంలో ఇలానే దర్శకుడు విక్రమ్ కుమార్ కు ఆశాభంగం ఎదురైంది. అల్లు అర్జున్ తో సినిమా ఆఖరి నిమిషంలో చేజారిపోయింది. ఆ తర్వాత నానితో గ్యాంగ్ లీడర్ సినిమా చేసిన విక్రమ్ కుమార్, ఇప్పుడు మరోసారి మెగా కాంపౌండ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు. హీరో రామ్ చరణ్ కు ఓ స్టోరీలైన్ వినిపించాడు.
చరణ్, విక్రమ్ కుమార్ మధ్య ఇప్పటికే ఓ సిట్టింగ్ జరిగింది. సినిమా కథను పైపైన కాకుండా, కాస్త డెప్త్ గానే చరణ్ కు చెప్పాడట విక్రమ్ కుమార్. అయితే రామ్ చరణ్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈమధ్య హీరోలంతా బౌండెడ్ స్క్రిప్ట్ లు డిమాండ్ చేస్తున్నారు. చరణ్ కూడా విక్రమ్ ను బౌండెడ్ స్క్రిప్ట్ కోరే అవకాశం ఉంది.
ఒకవేళ అలా జరిగినప్పటికీ ఆ తర్వాత చిరంజీవిని కూడా ఒప్పించాల్సి ఉంటుంది. బన్నీ విషయంలో ఫెయిలైన విక్రమ్ కుమార్ ఈసారి చరణ్ విషయంలోనైనా సక్సెస్ అవుతాడేమో చూడాలి. స్టోరీ ఓకే అయితే ఆర్-ఆర్-ఆర్ తర్వాత చరణ్ చేయబోయే సినిమా ఇదే అవుతుంది.