తన వేలితో తన కన్ను పొడుచుకుంటున్న బాబు

రాష్ట్రాన్ని, పార్టీని వదిలేసి కమ్మ జపం చేస్తూ.. జగన్ ని కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబుకి జగన్ షాకిచ్చారు. బాబును తన వేలితో తన కంట్లోనే పొడుచుకునేలా చేశారు. జగన్…

రాష్ట్రాన్ని, పార్టీని వదిలేసి కమ్మ జపం చేస్తూ.. జగన్ ని కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబుకి జగన్ షాకిచ్చారు. బాబును తన వేలితో తన కంట్లోనే పొడుచుకునేలా చేశారు. జగన్ ప్లాన్ తో చేశారో లేక పరిస్థితులే చంద్రబాబుకి అలా అడ్డంగా మారాయో కానీ.. మొత్తానికి కమ్మ సామాజిక వర్గం బాబుపై విరుచుకుపడుతోంది. 

కమ్మ సామాజిక వర్గానికి పట్టిన చీడపురుగు చంద్రబాబు అనేశారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. బాబు వల్లే తాము ఇబ్బంది పడుతున్నామని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ కులాలు, మతాల వారీగా ఎప్పుడూ ఎవర్నీ విభజనతో చూడలేదని, చంద్రబాబుకే కులపిచ్చి ఎక్కువని, అందుకే రమేష్ హాస్పిటల్స్ వ్యవహారంలో కులాన్ని తీసుకొచ్చి నీఛ రాజకీయాలు చేశారని విమర్శించారు.

ఇక కొడాలి నాని. చంద్రబాబుని అదే సామాజిక వర్గాన్నుంచి వచ్చి అంతలా తిట్టింది బహుశా కొడాలి నాని ఒక్కరేనేమో. చంద్రబాబుని చడామడా తిట్టింది తానొక్కడినే కాదని వాళ్ల మామ ఎన్టీఆరే దానికి ఆద్యుడని అంటారు నాని. తాజాగా ఆయన చంద్రబాబుని టీడీపీ అధ్యక్షుడు కాదు, కమ్మసంఘం అధ్యక్షుడంటూ.. ఆయనలోని కులతత్వాన్ని బజారుకీడ్చారు. కులం కోసం, కులంలో ఉన్నవారి అభివృద్ధి కోసం పాకులాడేవారు ఉంటారు కానీ, తప్పుడు మనుషులందర్నీ వెనకేసుకొచ్చి, దానికి కులం రంగు పులిమి, ఇతరులపై విషం చిమ్మే చంద్రబాబు లాంటివారిని ఎక్కడా చూడలేదంటున్నారు నాని.

అటు మోహన్ బాబు కూడా చంద్రబాబు పేరెత్తితేనే మండిపడిపోతున్నారు. తనతో కలసి వ్యాపారం మొదలు పెట్టి.. తనను మోసం చేసిన పార్టనర్ చంద్రబాబు అని ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు చెప్పారు మోహన్ బాబు. తాజాగా ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి బాబుని ఉతికి ఆరేశారు. బాబును చచ్చిన పాముతో పోల్చారు.

ఇలా వరుసగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులే చంద్రబాబుని టార్గెట్ చేశారు. ఇప్పటి వరకూ తాను ఏ సామాజిక వర్గాన్ని ఉద్ధరిస్తున్నానని బాబు బిల్డప్ ఇచ్చారో అదే సామాజిక వర్గానికి చెందిన వారు బాబుని ఛీదరించుకుంటున్నారు. వీరిలా బైటపడలేని వారు ఇంకెంతమంది ఉన్నారో లెక్కే లేదు.

మహిళలు అనే కనికరం కూడా లేకుండా తన వర్గానికే చెందిన కొంతమంది రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడ్డారు బాబు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో కూడా సగం మంది బాబుకి వ్యతిరేకమే. అవసరం వచ్చినప్పుడు కుటుంబం వైపు చూస్తూ, అవసరం తీరాక.. అందర్నీ కరివేపాకులా తీసి పారేయడం బాబుకి అలవాటే. ఆ అలవాటే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి బాబుని దూరం చేస్తోంది.

రాష్ట్రానికి ఇక ఎప్పటికీ నాయకుడు కాలేని స్థితిలో ఉన్న చంద్రబాబు.. కనీసం ఆయన సామాజిక వర్గానికి కూడా ప్రతినిధిగా నిలబడలేకపోతున్నారు. ఈ దశలో రాజకీయ గురువైన రామోజీరావు, కుల గురువైన మరో “పెద్దాయన” బాబును ఎలా ఒడ్డున పడేస్తారో చూడాలి. 

చిరు పవన్ వరుసగా మెగా ప్రాజెక్టులు

అప్ప‌ట్లో శంక‌ర‌రావు…ఇప్పుడు రాఘ‌రామ‌కృష్ణంరాజు