బైక్ ప్రమాదానికి గురయి నెల రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు హీరో సాయి ధరమ్ తేజ్. దాదాపు ప్రాణం మీదకు తెచ్చింది ఆ ప్రమాదం.
దసరా టైమ్ లో ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చారు కానీ ఇప్పటి వరకు ఆయన ఫొటొ ఒకటీ బయటకు రాలేదు. ఇలాంటి నేపథ్యంలో దీపావళికి మెగాస్టార్ ఇంట్లో జరిగిన మెగా వేడుకకు సాయి ధరమ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన మెగా గ్రూప్ ఫొటోను మెగాస్టార్ తన ట్విట్టర్ అక్కౌంట్ లో షేర్ చేసారు.
దీంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. ప్రమాదం తరువాత సాయి ధరమ్ తేజ్ ఫొటో చూడడం ఇదే. కొద్దిగా గడ్డంతో, కళ్లజోడుతో, స్లిమ్ గా కనిపించారు తేజు. మిగిలిన మెగా హీరోలు అందరూ ఇదే పిక్ లో వున్నారు.
ఇదిలా వుంటే జనవరి నుంచి సాయి ధరమ్ తేజ్ రెగ్యులర్ షూటింగ్ కు హాజరవుతారని తెలుస్తోంది. బోగవిల్లి ప్రసాద్ నిర్మాణంలో ప్రారంభమైన సినిమా సెట్ మీదకు ఆయన వస్తారు.