శాకుంతలం ట్రయిలర్: కథ క్లియర్.. గ్రాఫిక్స్ సూపర్

సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతలం సినిమా ట్రయిలర్ రిలీజైంది. ఈ సినిమా విడుదల, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎందుకు లేట్ అయ్యాయో ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. శాకుంతలం ట్రయిలర్ లో గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి.…

సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతలం సినిమా ట్రయిలర్ రిలీజైంది. ఈ సినిమా విడుదల, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎందుకు లేట్ అయ్యాయో ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. శాకుంతలం ట్రయిలర్ లో గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి.

ఈ కథ గురించి చాలామందికి తెలిసిందే. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మేనక, విశ్వామిత్రకు శకుంతల జన్మించిందనే విషయం నుంచి మొదలుపెట్టి, ఆమె దుష్యంతుడ్ని కలవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని ట్రయిలర్ లో విడమర్చి చెప్పారు.

ఈ సినిమా కథ ఏంటనే చర్చ అనవసరం. ఎందుకంటే చాలామందికి తెలిసిన కథ. దాన్ని గ్రాఫిక్స్, సెట్స్ తో ఎంత అద్భుతంగా ప్రజెంట్ చేశారనేది ముఖ్యం. ట్రయిలర్ చూస్తుంటే దర్శకుడు గణశేఖర్ ఆ పనిని సమర్థంగా నిర్వహించినట్టు కనిపిస్తోంది.

రెండున్నర నిమిషాలకు పైగా సాగిన ట్రయిలర్ లో ఓవైపు గ్రాఫిక్స్, మరోవైపు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సులు పోటాపోటీగా ఉన్నాయి. శాకుంతలంగా సమంత మేకోవర్ బాగుంది. సాత్వికంగా కనిపించే ఆమె ముఖం ఆకట్టుకుంటుంది. ఇక దుష్యంతుడిగా దేవ్ మోహన్ తో పాటు ఇతర పాత్రలు పోషించిన అనన్య నాగళ్ల, మోహన్ బాబు, గౌతమి, ప్రకాష్ రాజ్ పాత్రల్ని ట్రయిలర్ లో చూపించారు.

ట్రయిలర్ చివర్లో అల్లు అర్జున్ కూతురు అర్హను భరతుడి పాత్రలో సింహంపై వచ్చేలా పరిచయం చేసిన విధానం బాగుంది. టెక్నికల్ గా ట్రయిలర్ చాలా బాగుంది. శేఖర్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. గుణశేఖర్, దిల్ రాజు కలిసి నిర్మించిన ఈ సినిమా వచ్చేనెల 17న థియేటర్లలోకి వస్తోంది.