సమంత..చానాళ్ల తరువాత పబ్లిక్ ఫంక్షన్ కు హాజరయ్యారు. కాస్త బలహీనంగానే వున్నా, శాకుంతలం సినిమా ట్రయిలర్ విడుదల ఫంక్షన్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు నిమషాలు ‘గ్రేట్ ఆంధ్ర’ ఆమెను పలకరించింది.
హాయ్ సమంత..ఎలా వున్నారు?
హాయ్ అండీ..బాగున్నాను.. మీరెలా వున్నారు.
మీ ఆరోగ్యం ఎలా వుంది ఇప్పుడు?
ఒక్కోసారి ఒకలా వుంటోంది. కొంత బాగుంటోంది. కొన్ని సార్లు అలా వుండడం లేదు.
చేతికి ఆ జపమాల ఏంటీ? సినిమా ప్రచారం కోసమా?
కాదండీ..సినిమా ప్రమోషన్ కోసం ఏమీ చేయను. ఇది లక్ష జపం చేయడం కోసం.
లక్షసార్లా? ఏ మంత్రం?
వేరే వేరే వున్నాయి…ఓం హైం..క్రీం..అలా.
వెరీగుడ్..భగవంతుడిని నమ్ముకున్నారు. మీకు తప్పక నయం అవుతుంది.
థాంక్యూ.