అందచందాలతో పాటు మాటలతో అభిమానుల్ని ఫిదా చేసే హీరోయిన్లు ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ నభా నటేష్ ముందు వరుసలో ఉంటారు. అమాయకంగా మాట్లాడుతూ బోలెడు విషయాలను వెల్లడిస్తుంటారామె. తనకిష్టమైన సంగతుల గురించి ఆమె నిర్మొహమాటంగా చెబుతారు. తన మనసుకు నచ్చిన వ్యక్తుల గురించి లోకానికి చెప్పడంలో ఆమె ఎలాంటి గోప్యత పాటించాలని భావించరు.
మీ మనసును దోచుకోవాలంటే ఏం చేయాలనే ప్రశ్నకు హీరోయిన్ నభా నటేష్ ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు. ఇంతకూ ఆమె ఏమంటారంటే… ‘ఎదుటి వ్యక్తిలో నేను మొదట చూసేది హాస్య చతురత. అది ఉంటే చాలు. దేనీ గురించి ఆలోచించను. ఆ తర్వాత సున్నితత్వం. ఎదుటి వాళ్ల ఆలోచనల్ని, భావోద్వేగాల్ని అర్థం చేసుకుని నడుచుకునే వాళ్లంటే చాలా ఇష్టం. అలా నా జీవితంలోకి ఒకరొచ్చారు. ఆయన పేరు షారుఖ్ ఖాన్ ’ అని చెప్పేశారు.
ఇంకా ఆమె ఏఏ సంగతులు చెప్పారో తెలుసుకుందామా? అయితే పదండి ఆమె చెప్పే గమ్మత్తైన విషయాలు తెలుసుకునేందుకు…‘ బాల్యం నుంచి షారుక్ సినిమాలు చూస్తూ ఆయనపై అభిమానం పెంచుకున్నా. ‘కుచ్ కుచ్ హోతా హై’ ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. స్కూల్, కాలేజీ వయసులో ఆకర్షణ అనేది ఉండడం సహజమే కదా! ఆ విధంగా షారుఖ్ ఆకర్షణలో పడిపోయానంతే’ అని సరదాగా చెప్పుకొచ్చారు నభ.
అవునండోయ్ ఈమెగారు టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’,‘అల్లుడు అదుర్స్’ సినిమా లతో తెలుగు ప్రేక్షకులను కనువిందు చేసేందుకు సిద్ధమవుతున్నారు.