నిశ్ళబ్ధంగా నిశ్బబ్దం

ఓటిటిలోకి నాని-ఇంద్రగంటి కాంబినేషన్ లోని వి సినిమా అడుగుపెట్టింది. దీంతో చిన్న, చితక, బుల్లి, బుచ్చి సినిమాలు కాకుండా, కాస్త ఓ రేంజ్ వున్న సినిమాలు ఓటిటి లోకి రావడం అన్నది వి సినిమాతోనే…

ఓటిటిలోకి నాని-ఇంద్రగంటి కాంబినేషన్ లోని వి సినిమా అడుగుపెట్టింది. దీంతో చిన్న, చితక, బుల్లి, బుచ్చి సినిమాలు కాకుండా, కాస్త ఓ రేంజ్ వున్న సినిమాలు ఓటిటి లోకి రావడం అన్నది వి సినిమాతోనే ప్రారంభం. ఈ సినిమా తరువాత ఓటిటి లోకి రావడానికి చాలా సినిమాలు క్యూలో వున్నాయి. అలాంటి వాటిల్లో నిశ్శబ్దం ఒకటి.

అనుష్క-మాధవన్ కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన ఈ సినిమా అన్నింటికన్నా ముందే ఒటిటి లోకి రావాల్సింది. కానీ పలు కారణాలు వున్నాయి. ఈ కారణాలు ఏమిటి అన్నది విడుదల తరువాత ముచ్చటించుకుందాం. ఎందుకంటే విడుదలకు ముందే ఇలాంటివి ముచ్చటించుకుంటే అంత బాగోదు

అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, ఈ సినిమా ఓటిటి విడుదలకు వున్న అడ్డంకులు అన్నీ దాదాపు పక్కకు పోయినట్లే. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈవారంలోనే నిశ్శబ్ధం సినిమా ఓటిటి ఎంట్రీ మీద ఫుల్ క్లారిటీ అండ్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల వుంటుందని తెలుస్తోంది.