తెలుగు సినిమాను కథల కొరత పట్టి పీడిస్తున్నట్లు వుంది. అందుకే ఓ దొంగ కథ కోసం పోటీ పడిపోతున్నారు. స్టూవర్ట్ పురం గజదొంగ లైఫ్ హిస్టరీ తో టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా గత ఏడాదిన్నరగా వార్తల్లో వుంది. చాలా బ్యానర్లు మారింది. చాలా హీరోల దగ్గరకు వెళ్లింది. అలా వెళ్లిన హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా వున్నారు.
మరి అతని మీద అంత పెట్టుబఢి పెట్టలేమనో, అతని మార్కెట్ అంత బాలేదనో, వర్కవుట్ కాదనో మొత్తానికి అక్కడి నుంచి వెనక్కు వచ్చింది. ఆఖరికి అభిషేక్ అగర్వాల్-రవితేజ కాంబినేషన్ లో ఫిక్స్ అయింది.
కానీ అంతలోనే పోటీగా అదే బయోపిక్ ఇంకో టైటిల్ తో అనౌన్స్ మెంట్ వచ్చింది. టైగర్ నాగేశ్వరరావు అనౌన్స్ మెంట్ వచ్చిన ప్రతిసారీ పోటీగా ఈ అనౌన్స్ మెంట్ రావడం చిత్రం. పైగా ఎప్పుడో సినిమా నిర్మాణం ఆపేసిన నిర్మాత బెల్లంకొండ సురేష్ మళ్లీ తన బ్యానర్ ను బయటకు తీయడం ఇంకా విశేషం.
రవితేజ సినిమా అంటే స్క్రిప్ట్ రెడీగా వుంది. మరి బెల్లంకొండకు కూడా అదే లైన్ లో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారా? ఏమో?