నార్త్ కంటే సౌత్ లోనే మహిళలు సేఫ్

భారతీయ మహిళలు ఎక్కువ సురక్షితంగా ఎక్కడ ఫీలవుతున్నారు. ఈ అంశంపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఎక్కువ పట్టణాలు దక్షిణ భారతదేశానికి చెందినవి ఉన్నాయి. Advertisement 'ఉమెన్ ఫ్రెండ్లీ సిటీస్'పై అవతార్…

భారతీయ మహిళలు ఎక్కువ సురక్షితంగా ఎక్కడ ఫీలవుతున్నారు. ఈ అంశంపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఎక్కువ పట్టణాలు దక్షిణ భారతదేశానికి చెందినవి ఉన్నాయి.

'ఉమెన్ ఫ్రెండ్లీ సిటీస్'పై అవతార్ గ్రూప్ ఓ సర్వే నిర్వహించింది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా ఈ సర్వే చేసింది. సామాజిక భద్రత స్కోర్, పారిశ్రామిక ఉపాధి స్కోర్ ఆధారంగా ఈ సర్వే నిర్వహించింది. ఆరోగ్యం, విద్య, ఉపాధి, సమగ్ర పట్టణ సామాజిక సేవల ఆధారంగా కూడా ఈ స్కోర్ నిర్ణయించారు.

నివేదిక ప్రకారం చెన్నై మొదటి స్థానంలో నిలిచింది. ఎక్కువమంది మహిళలు, చెన్నైను ఉపాధి పరంగా, సామాజిక భద్రత పరంగా మెరుగైనదిగా భావిస్తున్నారు. ఇక రెండో స్థానంలో పూణె, మూడో స్థానంలో బెంగళూరు నగరాలు నిలిచాయి.

రాష్ట్రాల పరంగా చూసుకుంటే, మెరుగైన స్కోర్ తో కేరళ మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో కర్నాటక నిలిచాయి. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ లు 4, 5 స్థానాల్లో నిలిచాయి.

టాప్-10 విమెన్ ఫ్రెండ్లీ సిటీస్ లో ఢిల్లీకి స్థానం దక్కలేదు. ఢిల్లీ, కోల్ కతా నగరాలు ఉపాధిపరంగా ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ, సామాజిక భద్రత పరంగా వెనుకబడ్డాయని సర్వే చెబుతోంది.. అదే టైమ్ లో హుబ్లీ, నాగపూర్, అహ్మదాబాద్, కోయంబత్తూరు నగరాలు మహిళలకు మెరుగైన ఉపాధిని అందించే నగరాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.