మోడీకి కూడా అయోధ్య భయం!

అయోధ్య వివాదానికి సంబంధించి కోర్టు తీర్పు రాబోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన  కేబినెట్ కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయోధ్య విషయంలో ఎలాంటి తీర్పు వచ్చినా స్పందించే పనులు పెట్టుకోవద్దని మోడీ…

అయోధ్య వివాదానికి సంబంధించి కోర్టు తీర్పు రాబోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన  కేబినెట్ కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయోధ్య విషయంలో ఎలాంటి తీర్పు వచ్చినా స్పందించే పనులు పెట్టుకోవద్దని మోడీ తన మంత్రి వర్గ సహచరులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది.

ఈ నెల పదిహేడు లోగా అయోధ్యకు సంబంధించిన తీర్పు రాబోతూ ఉంది. దశాబ్దాలుగా ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. దాదాపు పదేళ్ల కిందట ఒక తీర్పు వచ్చింది. అయితే ఆ తర్వాత కూడా పై స్థాయిలో విచారణ కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు వచ్చేది అంతిమ తీర్పు అనే అంచనాలున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా అలర్ట్ అవుతూ ఉన్నాయి. అత్యంత సున్నితమైన ఈ అంశం విషయంలో నేతల స్పందనలు చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. నేతల స్పందనలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టే  అవకాశాలు కూడా లేకపోలేదు.

ఇలాంటి నేపథ్యంలో పార్టీలు ముందుగానే అలర్ట్ అవుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ప్రియాంక గాంధీ తన పార్టీ వాళ్లకు ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య పై ఎలాంటి తీర్పు వచ్చినా.. ఇష్టానుసారం స్పందించవద్దని, పార్టీ అజెండాకు అనుకూలంగా నడుచుకోవాలని ఆమె సూచించారు.

నేతలు ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడవద్దని ఆమె అదేశించారు, ఇప్పుడు మోడీ కూడా తన మంత్రి వర్గ సహచరులకు దాదాపు అలాంటి ఆదేశాలే జారీ చేశారు.