చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను అకస్మాత్తుగా బదిలీ చేసారు. అది బ్రాహ్మణులకే అవమానకరం అన్నంతగా ప్రచారం సాగిస్తున్నాయి పతిపక్షపార్టీలు. ఈ మేరకు బ్రాహ్మణ ఫేస్ బుక్ గ్రూప్ ల్లో కూడా ఫోస్ట్ లు కనిపిస్తున్నాయి.
పైగా క్రిస్టియన్ లాబీ కారణం అంటూ మరో యాంగిల్ ను ముడిపెట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఆ విషయం అలా వుంచితే, ఇప్పుడు ఈ కారణంగా బ్రాహ్మణులు వైకాపాకు దూరం అయిపోతారా? అయిపోవాలా?
అసలు తెలుగుదేశం, వైకాపాల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం ఇచ్చింది ఎవరు? పూజారులకు, అర్చకులకు మేలు చేసింది ఎవరు? ఎమ్మెల్యే టికెట్ లు ఇచ్చింది ఎవరు? అధికార పదవులు కట్టబెట్టింది ఎవరు? ఈ విషయం డిస్కషన్ కు పెడితే తెలుగుదేశం స్థానం ఎక్కడ వుంటుంది?
తెలుగుదేశం పార్టీ ఒక్క ఎమ్మెల్యే టికెట్ అయినా బ్రాహ్మణులకు ఇవ్వగలిగిందా? గెలిపించి శాసనసభకు పంపగలిగిందా? విశాఖ వుడా చైర్మన్ పదవి లాంటి కీలకమైన దానిని తెలుగుదేశం ఎప్పుడన్నా బ్రాహ్మణులకు ఇవ్వగలిగిందా? అర్చకుల సమస్యలు, ఆలయాల సమస్యలు తీర్చిందెవరు? సిఎమ్ పేషీ దగ్గర నుంచి అనేక చోట్ల కీలక పదవులను బ్రాహ్మణులకు ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఏనాడైనా బ్రాహ్మణులను దగ్గరకు తీయడం అనేది జరిగిందా?
ఇవన్నీ ఒకేఒక్క సిఎస్ వ్యవహారంతో మరచిపోయి బ్రాహ్మణులు దూరం అయిపోతారని ప్రతిపక్షాలు భావిస్తున్నాయా? ఈ ప్రచారానికి లొంగి, ఆ మాయలో పడి బ్రాహ్మణులు తమకు దగ్గరయిపోతారని ప్రతిపక్షాలు కలలు కంటే కనొచ్చు. కానీ బ్రాహ్మణులు మరీ అంత అమాయకంగా వుంటారని అనుకుంటే భ్రమే.