‘రౌడీ పిల్ల’ లేచిపోయింది!

మా అప్పిగాడి పంట పండేసింది. అప్సరస లాంటి పిల్ల వచ్చేసింది. కనపడ్డానికి కమెడియన్‌లా వుంటాడు కానీ, హీరోలాగానే సగం కథ నడిపేశాడు.  Advertisement పిల్ల వాణ్ణి లవ్వాడేసింది; ఇక పెళ్ళాడ్డమే తరువాయి. ఇంటర్వెల్ బ్రేక్…

మా అప్పిగాడి పంట పండేసింది. అప్సరస లాంటి పిల్ల వచ్చేసింది. కనపడ్డానికి కమెడియన్‌లా వుంటాడు కానీ, హీరోలాగానే సగం కథ నడిపేశాడు. 

పిల్ల వాణ్ణి లవ్వాడేసింది; ఇక పెళ్ళాడ్డమే తరువాయి. ఇంటర్వెల్ బ్రేక్ అన్నమాట. బ్రేక్‌కు ముందు ట్విస్టు వుండాలి కదా? ఉండకుండా వుంటుందా? అప్పి గాడి కోసం ఏదయినా వదలుకుంటానంది. తల్లి దండ్రుల్నీ వదిలేస్తానంది. దరిద్రపుగొట్టు కులాన్నీ వదిలేస్తానంది. కావాలంటే ఫేస్‌బుక్ అకౌంటు కూడా క్లోజ్ చేస్తానన్నది. ఇంకేం వదలు కోవాలి? 

సినిమాల్లో అంటారే… అవి.. వాటిని కూడా అంటే వది లేస్తానంది. అవే లెండి ప్రాణాలు. కానీ ఇవేమీ కాకుండా, ఒక్కటి వదిలెయ్యమన్నాడు. షాకయ్యింది. కుదరదన్నది. ఇంటర్వెల్ బ్రేక్ తర్వాత అదేమిటో తెలుస్తుంది కదా? అప్సరస తన చెలికత్తెలకు చెప్పింది. నవ్విపోయారు. 

ఇంతకీ మా అప్పిగాడు అడిగిందే మిటంటే.. ‘ఇమేజ్’. అవును ‘పేరు’ను వదులుకో మన్నాడు. అంటే ఆమె సొంత పేరూకాదు, ఇంటి పేరూ కాదు; మెడలో వేసుకునే కాసుల పేరూ కాదు. బుధ్ధిమంతురాలన్న పేరు. కాలేజీ దగ్గర తల దించితే, మళ్లీ ఇంటి దగ్గరే ఎత్తుతుందన్నపేరు. ఎవరినీ పల్లెత్తు మాట అనదన్న పేరు. హోల్‌సేల్‌గా మంచి పిల్లఅన్న పేరు. 

మా అప్పిగాడిది కరెక్ట్ డిమాండే కదా..? ఇద్దరూ లేచి పోయి, పెళ్ళి చేసుకున్నాక, ఆమె పుట్టింటి దగ్గర ‘సాహసి’ ‘మంచి పిల్ల’ ఇలాంటి బిరుదులివ్వరు కదా..? ఏ సంస్కర ణనీ మొదట్లో గొప్పగా చెప్పుకోలేదు. 

ఇక ఈ పెళ్ళి జరిగేది కాదు అన్న సమయంలో ఇంటి దగ్గర ఒక చీటి పెట్టి, అప్పి గాడి దగ్గరకు వచ్చేసింది. ‘నాకు అప్పిగాడంటే ప్రా ణం. వాడితోనే లేచి పోతున్నా… ఇట్లు రౌడీ పిల్ల’ అని చీటీలో వుంది. మంచిపనికెప్పు డూ ముందు మంచిపేరు వుండదు. మంచిప్రేమ క్కూడా అంతే…!

గౌరీపతి

బాబు వెన్నుపోటుకు 25 ఏళ్ళు