కళ్యాణం తరువాత అంతా బాగుంటే కమనీయంగానే వుంటుంది. లేదూ అంటేనే తేడా వస్తుంది. అప్పుడే సినిమాల్లో మాంటేజ్ సాంగ్ లు, సోలో గీతాలు అవసరం పడతాయి. యువి సంస్థ నిర్మిస్తున్న కళ్యాణం కమనీయం సినిమాలో ఇలాంటి పాట ఒకటి వుంది. ఉద్యోగం వున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న నిరుద్యోగి కి భార్యతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఇంకేం వుంది అన్నీ వున్నా లక్ ఎక్కడో దాక్కుంది గా అనుకుంటూ పాటేసుకున్నాడు.
కృష్ణకాంత్ రాయగా శ్రావణ్ భరద్వాజ్ స్వరపర్చిన ‘అయ్యో నాకేంటీ’ అనే సాంగ్ ను విడుదల చేసారు. 'అయ్యో ఎంటో నాకు అన్ని వచ్చి పక్కనున్న ఒక్క అదృష్టమేమో దూరముందే..అన్నీ ఇచ్చేసినట్టు ఇచ్చి లాగేసుకుంటు దైవం వైకుంఠపాళీ ఆడతాడే' అంటూ భార్యభర్తలైన హీరో హీరోయిన్ల మధ్య చిన్న చిన్న మనస్పర్థల నేపథ్యంలో సాగుతుందీ పాట.సంతోష్ శోభన్..ప్రియ భవానీ శంకర్ ల మీద ఈ పాటను చిత్రీకరించారు. 14న విడుదలవుతోందీ సినిమా.
పెద్ద సినిమాలతో పోటీ పడుతూ, సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ చిన్న క్యూట్ లవ్ స్టోరీ ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటోంది. సంక్రాంతి సందర్భంగా 14న సోలోగా బరిలోకి దిగుతోంది. అంతకన్నా ముందే అన్ని సినిమాలు విడుదలైపోతాయి.